నాణ్యమైన విత్తనాలు అందించాలి
నల్లగొండ టౌన్ : రైతులకు వానాకాలం సీజన్‌కు అవసరమైన విత్తనాలు, ఎరువులను అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. మంగళవారం ఎన్‌డీసీఎంఎస్‌లో పచ్చిరొట్ట విత్తనాల విక్రయాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది కలుగకుండా చూస్తున్నామన్నారు. పిల్లి పెసర, జీలుగ, జనుము విత్తనాలను 50 శాతం సబ్సిడీపై రైతులకు అందిస్తున్నామని.. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పాల్వాయి శ్రవణ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో నకిలీ విత్తనాల అమ్మకందారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. అనంతరం కలెక్టర్‌ను టీఎన్‌జీవోస్ నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, బిజినెస్ మేనేజర్ నాగిల్ల మురళి, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్, వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, టీఎన్‌జీవో జిల్లా కార్యదర్శి జె.శేఖర్‌రెడ్డి, ఏఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి


