చెరువు శిఖం ఆక్రమణపై విచారణ
నార్కట్‌పల్లి : చెర్వుగట్టు గ్రామ శివారులో గల 50 ఎకరాల చెరువు శిఖం ఆక్రమణపై బుధవారం జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి సమగ్ర విచారణ చేపట్టారు. గ్రామంలోని 50 ఎకరాల చెరువు శిఖం భూమిని చెర్వుగట్టు గ్రామ పంచాయతీ యశోధ టౌన్‌షిప్‌కు ఇచ్చినట్లు ఫిర్యాదులు అందడంతో.. 2012 నుంచి 2020 వరకు ఇక్కడ పనిచేసిన పంచాయతీ కార్యదర్శులపై విచారణ చేపట్టారు. విచారణలో డీఎల్‌పీఓ లక్ష్మీనారాయణ, చందంపేట ఎంపీడీఓ లక్ష్మి, ఎంపీఓలు సత్యనారాయణ, సురేష్‌రెడ్డి, కార్యదర్శులు శ్రవణ్‌కుమార్‌రెడ్డి, జ్యోతి, రిటైర్డ్ కార్యదర్శి యాదగిరిరెడ్డి ఉన్నారు.
చెరువులు నింపితేనే భూగర్భ జలాల పెంపు
చిట్యాల : చెరువులను నింపుకోవటం ద్వారానే భూగర్భ జలాల పెరుగుతాయని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. చిట్యాల మండలంలోని ఉరుమడ్ల ఊర చెరువు మరమ్మతు పనులను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రూ.1.18 కోట్లతో ఊర చెరువు మరమ్మతు పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీనర్సింహ, ఏఎంసీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, వనమా వెంకటేశ్వర్లు, చెరుకు సైదులు, పొలగోని స్వామి, పల్లపు బుద్దుడు, పట్ల జనార్దన్, జనపాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తేవాలి
రామగిరి(నల్లగొండ) : ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ సూచించారు. బుధవారం నల్లగొండ సమీపంలో ఆర్జాలబావిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లోని తూర్పార యంత్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కేంద్రం నిర్వాహకులకు సహకరించాలని రైతులకు సూచించారు. ఆయన వెంట డీసీఎస్‌ఓ హరీష్, డీటీ దీపక్, ఏఓ ఎస్.శ్రీనివాస్ ఉన్నారు.
ఏఈఓలు రైతులకు అందుబాటులో ఉండాలి
చిట్యాల, నార్కట్‌పల్లి : ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఏఈఓలు రైతులకు అందుబాటులో ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్‌కుమార్ సూచించారు. బుధవారం నార్కట్‌పల్లి, చిట్యాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ధాన్యం కొనుగోలు తీరుపై ఆరాతీశారు. రైతులు ధాన్యాన్ని అరబెట్టి తేమ శాతం 17 లోపు ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు. తూర్పార బట్టిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలన్నారు. ఆయన వెంట డీసీఓ పత్యానాయక్, మానిటరింగ్ ఆఫీసర్ రేణుక, ఏఓ గౌతమ్, పీఏసీఎస్ సీఈఓ బ్రహ్మాచారి, ఏఈఓలు మనిషా, నవీన్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, మార్కెట్ ఇన్‌చార్జి రాము, నాగరాజు, వెంకటేశ్వర్లు, నరేష్ తదితరులు ఉన్నారు.
చెరువు శిఖం ఆక్రమణపై విచారణ
చెరువు శిఖం ఆక్రమణపై విచారణ


