జగ్జీవన్‌రామ్‌ స్ఫూర్తితో ముందుకెళ్లాలి | - | Sakshi
Sakshi News home page

జగ్జీవన్‌రామ్‌ స్ఫూర్తితో ముందుకెళ్లాలి

Apr 6 2025 1:45 AM | Updated on Apr 6 2025 1:45 AM

జగ్జీవన్‌రామ్‌ స్ఫూర్తితో ముందుకెళ్లాలి

జగ్జీవన్‌రామ్‌ స్ఫూర్తితో ముందుకెళ్లాలి

నల్లగొండ టౌన్‌ : యువత డాక్టర్‌ బాబు జగ్జీవన్‌రామ్‌ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం జగ్జీవన్‌రామ్‌ 118వ జయంతి సందర్భంగా నల్లగొండలోని ఎన్జీ కళాశాల ఎదురుగా, మర్రిగూడ బైపాస్‌ వద్ద ఉన్న జగ్జీవన్‌రామ్‌ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం క్లాక్‌టవర్‌ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ జగ్జీవన్‌రామ్‌ అంటరానితనం నిర్మూలనకు కృషి చేశాడన్నారు. జిల్లాలో అభివృద్ధిలో భాగంగా ఈనెల7న అడ్వాన్స్‌ టెక్నాలజీ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నారన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ భవన్‌లో మరమ్మతులకు జిల్లా మినరల్‌ ఫండ్‌ నుంచి రూ.25 లక్షలు ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌, చొల్లేటి ప్రభాకర్‌, చక్రహరి రామరాజు, వంగూరి లక్ష్మయ్య, దున్న యాదగిరి, బొర్ర సుధాకర్‌, కత్తుల జగన్‌కుమార్‌, సంహితారాణి, పెరిక హ రిప్రసాద్‌, ఇరిగి ప్రసాద్‌, అంజిబాబు పాల్గొన్నారు.

ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement