రెవెన్యూ వ్యవస్థలో నూతనోత్సాహం
సాక్షి,యాదాద్రి : ప్రజా ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూ భారతి చట్టంతో రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో నూతనోత్సాహం వచ్చిందని తెలంగాణ ఉద్యోగుల సంఘం జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి అన్నారు. శుక్రవారం యాదాద్రి జిల్లా కేంద్రం భువనగిరిలోని వివేరా హోట్‌లో టీజీఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు బాణాల రాంరెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒకరు చొప్పున గ్రామ పరిపాలన అధికారులను నియామకం చేయడం వలన రైతులకు రెవెన్యూ సేవలు చేరువ కావడంతో పాటు రెవెన్యూ ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయన్నారు. దీంతో రెవెన్యూ వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. గ్రామ స్థాయిలోనే రెవెన్యూ సేవలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం 10,954 మంది గ్రామ పాలన అధికారులను వ్యక్తిగత ఆప్షన్ల ద్వారా నియామకం చేసిందన్నారు. ప్రజా ప్రభుత్వ సహకారంతో దేశ చరిత్రలోనే తొలిసారిగా 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టులను సాధించామన్నారు. అలాగే గతంలో ధరణిలో తహసీల్దార్లకు, ఆర్డీఓలకు, అడిషనల్ కలెక్టర్లకు అధికారాలు లేని కారణంగా రైతుల సమస్యలు సత్వరం పరిష్కరించే పరిస్థితి లేదన్నారు. కానీ త్వరలోనే అమల్లోకి రాబోతున్న భూ భారతి చట్టం ద్వారా అధికారాల వికేంద్రీకరణ జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉందన్నారు.
క్షేత్రస్థాయికి రెవెన్యూ సేవలు..
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో చేప్పట్టిన భూ సంస్కరణలతో ఏకంగా భూ సమస్యల పరిష్కార వేదిక జిల్లా కేంద్రానికి చేరడంతో రైతుల ఇబ్బందులు వర్ణనాతీతం. అయితే తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మళ్లీ గ్రామీణ స్థాయి రెవెన్యూ వ్యవస్థ క్రమంగా బలోపేతం అవుతుందని లచ్చిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యకారుడు ఏపూరి సోమన్న ఆట,పాటలు సభికులను ఉత్సాహపర్చాయి. ఆత్మీయ సమ్మేళనంలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ, కోశాధికారి వెంకట్ రెడ్డి, టీజీటీఏ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎస్.రాములు, రమేష్ పాక, టీజీఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు బాణాల రాంరెడ్డి, వి.భిక్షం, కోశాధికారి మల్లేశం, పూర్వపు వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరిక ఉపేందర్ రావు, భువనగిరి ఆర్డీఓ కష్ణారెడ్డి, చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి, ఎస్డీసీ డిప్యూటీ కలెక్టర్ జగన్నాథం, టీజీటీఏ సెక్రటరీ జనరల్ పూల్ సింగ్, టీజీటీఏ మహిళా విభాగం అధ్యక్షులు పి.రాధ, టీజీటీఏ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ చిల్ల శ్రీనివాస్, టీజీఆర్‌ఎస్‌ఏ మహిళా విభాగం అధ్యక్షురాలు సుజాత చౌహాన్, టీజీఆర్‌ఎస్‌ఏ సీసీఎల్‌ఏ విభాగం అధ్యక్షులు కష్ణ చైతన్య, టీజీటీఏ నల్లగొండ జిల్లా అధ్యక్షులు పి. శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ జీ. దశరథ, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఆర్. అమీన్ సింగ్, జనరల్ సెక్రటరీ బి. రామకష్ణ రెడ్డి, యాదాద్రి, సూర్యాపేట, నల్లగొండ జిల్లా తహసీల్దార్లు, టీజీఆర్‌ఎస్‌ఏ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు ఎస్.కుమార్‌రెడ్డి, జనరల్ సెక్రటరీ రామకష్ణ, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ఎం. రాంరెడ్డి, జనరల్ సెక్రటరీ బి.కట్లమయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కె. వెంకట్ రెడ్డి, జనరల్ సెక్రటరీ బి.పల్లవి ఉమ్మడి జిల్లాల నుంచి తరలివచ్చిన రెవెన్యూ ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఫ తెలంగాణ ఉద్యోగుల సంఘం జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి


