భువనగిరి: సూర్యాపేట ఎమ్మెల్యే జి. జగదీష్‌రెడ్డిపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో శనివారం భువనగిరి పట్టణంలోని రైతు బజార్ ఎదురుగా ప్రధాన రహదారిపై రాస్తారోకో చేసి నల్లబ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్ సమీపంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చింతల వెంకటేశ్వర్లురెడ్డి మాట్లాడారు. జగదీష్‌రెడ్డిపై ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. వెంటనే ఎమ్మెల్యేపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మాజీ జిల్లా కన్వీనర్ కోల్పుల అమరేందర్, పీఏసీఎస్ చైర్మన్ నోముల పరమేశ్వర్‌రెడ్డి, పార్టీ పట్టణ, మండల కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఏవీ కిరణ్‌కుమార్, జనగాం పాండు, రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు బీరు మల్లయ్య, లక్ష్మీనారాయణ, రాజేందర్‌రెడ్డి, ర్యాకల శ్రీనివాస్, మల్లికార్జున్, ఇట్టబోయిన గోపాల్, తుమ్మల పాండు, సుభాష్, శంకర్, చిరంజీవి, సురేష్, జంగయ్య, ఇస్మాయిల్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.