వర్షాకాలంలో మినహాయిస్తే.. మిగతా కాలంలో ఎల్లూరు పంప్‌హౌజ్‌లోని మూడు మోటార్ల ద్వారా రోజువారీగా నీటిని పంపింగ్ చేస్తున్నాం. సాగునీటితో పాటు, మిషన్ భగీరథకు కూడా ఈ ప్రాజెక్టు ద్వారానే నీటిని ఎత్తిపోస్తున్నాం. దీంతో మోటార్లపై భారం పడుతోంది. అయినా తప్పడం లేదు. పాలమూరు ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతలు ప్రారంభమైతే కేఎల్‌ఐపై భారం తగ్గుతుంది. 2024–25లో 50 టీఎంసీల నీటిని ఎత్తిపోయగా.. 2025–26 సీజన్‌లో 43.5 టీఎంసీల నీటిని ఎత్తిపోశాం. – లోకిలాల్‌నాయక్, డీఈఈ


