గిరిజనులకు అండగా కాంగ్రెస్‌ | - | Sakshi
Sakshi News home page

గిరిజనులకు అండగా కాంగ్రెస్‌

Jun 27 2026 2:13 AM | Updated on Jun 27 2026 2:13 AM

50 ఏళ్ల క్రితమే రిజర్వేషన్‌ ఫలాలు

రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్‌/కందనూలు/అచ్చంపేట రూరల్‌: మొదటి నుంచి ఆదివాసీ గిరిజనులకు అండగా ఉన్నది కాంగ్రెస్‌ పార్టీయేనని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఇందిరమ్మ ఆశీర్వాద బస్సుయాత్ర శుక్రవారం కొల్లాపూర్‌లోని ఎన్టీఆర్‌ చౌరస్తాకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మహబూబాబాద్‌ ఎంపీ బలరాంనాయక్‌, ఎమ్మెల్యేలు రాంచందర్‌నాయక్‌, బాలునాయక్‌, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌, ట్రైకార్‌ చైర్మన్‌ బెల్లయ్యనాయక్‌, మాజీ ఎంపీ రవీందర్‌నాయక్‌లతో కలిసి మంత్రి మాట్లాడారు. 50 ఏళ్ల క్రితమే ఆదివాసీ, గిరిజనులందరికీ రిజర్వేషన్‌ ఫలా లు అందించిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదని అన్నారు. రిజర్వేషన్ల ఫలితంగా సమాజంలో ఆది వాసీ గిరిజనులు అసమానతలకు లోనుకాకుండా ఉన్నారని వివరించారు. కేంద్రంలోని బీజేపీతో పా టు రాష్ట్రంలోని బీఆర్‌ఎస్‌ గిరిజనుల సంక్షేమానికి ఎలాంటి కృషిచేయలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు.

దివంగత ప్రధాని ఇందిరమ్మ రాజ్యంలోనే ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడం జరిగిందని ప్రభుత్వ విప్‌ రాంచంద్రునాయక్‌ అన్నారు. ఆదివాసీ, గిరిజన కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు చేపట్టిన బస్సు యాత్ర జిల్లాకేంద్రానికి చేరుకుంది. ఈ సందర్బంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1976 సెప్టెంబర్‌ 18న లంబాడీ, ఎరుకల, ఆదివాసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం గిరిజనుల జీవితాలను సమూలంగా మార్చేశాయన్నారు. అదే విధంగా ప్రస్తుత ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్యంలో గిరిజనులకు, గిరిజన తండాలకు ప్రత్యేక నిధులు ఇస్తూ.. తమ అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తున్నారన్నారు. రిజర్వేషన్లు ఇచ్చి 50ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సెప్టెంబర్‌ 18న ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహి ంచనున్నట్లు తెలిపారు. ఎంపీ బలరాంనాయక్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ ప్రభుత్వంలో నలుగురు బంజార బిడ్డలను పొట్టనపెట్టుకోవడం జరిగిందన్నారు. అలాగే జీఓ నంబరు 3ను రద్దు చేసి, గిరిజన కుటుంబాలకు ఉద్యోగాలు రాకుండా చేశారని ఆరోపించారు. అదే విధంగా బిజినేపల్లి, అచ్చంపేట ప్రాంతాల్లో బస్సుయాత్ర కొనసాగింది. కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, వంశీకృష్ణ, శంకర్‌నాయక్‌, బాలునాయక్‌, మురళీనాయక్‌, ఎమ్మెల్సీ శంకర్‌నాయ క్‌, మాజీ ఎంపీ రవీంద్రనాయక్‌, రాంచంద్రనాయక్‌, హన్మంతునాయక్‌, గోవిందునాయక్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement