నిబంధనలు నదిలో తొక్కుతున్నారు | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు నదిలో తొక్కుతున్నారు

Jun 27 2026 2:13 AM | Updated on Jun 27 2026 2:13 AM

పరిమితికి మించి బోటులో ప్రయాణికులు

లైఫ్‌జాకెట్టు లేని పరిస్థితి

తప్పిన పెను ప్రమాదం

కొల్లాపూర్‌ రూరల్‌: మండల పరిధిలోని సోమశిల కృష్ణానది బ్యాక్‌ వాటర్‌ నుంచి బోటులో అవతలి ఒడ్డున ఉన్న సంగేమేశ్వరాలయానికి నిబంధనలకు మించి పర్యాటకులను తరలిస్తున్నారు. శుక్రవారం సిద్దేశ్వరం గ్రామానికి చెందిన బోటు యాజమానులు డబ్బులకు కక్కుర్తిపడి దాదాపుగా 80 మందిని ఒకే బోటులో ఎక్కించుకొని సోమశిలకు వస్తు న్న క్రమంలో మధ్యలో సాంకేతిక సమస్యతో నదిలో ఆగిపోయింది. దీంతో పర్యాటకులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే బోటు డ్రైవర్‌ సోమశిల బోటు వారికి సమాచారం ఇవ్వడంతో సోమశిల నుంచి మరబోటు వచ్చి ఆగిన బోటుకు తాడుకట్టి ఇవతలి ఒడ్డుకు తీసుకొచ్చిందని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వచ్చినట్లు వాపోయారు. బోటులో ఎలాంటి లైఫ్‌ జాకెట్లు లేవని, నిబంధనలు పాటించని బోటు యాజమానులపై చర్యలు తీసుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement