ప్రాణం తీసిన.. బైక్ సరదా
● అతివేగంగా వెళ్లి కిందపడటంతో బాలుడి దుర్మరణం
వైభవంగా ఉమామహేశ్వర బ్రహ్మోత్సవాలు
అచ్చంపేట రూరల్: శ్రీశైల ఉత్తర ముఖద్వారమైన ఉమామహేశ్వర క్షేత్రం బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. ఈ నెల 15 నుంచి 22 వరకు కొనసాగనున్న బ్రహ్మోత్సవాలకు సంబంధించి వాల్‌పోస్టర్‌ను శనివారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఆయన సతీమణి, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు అనురాధ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. అలాగే రంగాపూర్, దర్గాతండా వద్ద హజ్రత్ నిరంజన్‌షావలీ ఉర్సు కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉందని, రెండుచోట్ల భక్తులకు అన్ని వసతులు కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శనిదోష నివారణ పూజలు
బిజినేపల్లి: శనిదోష నివారణ కోసం భక్తుల చేత ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు శనేశ్వరస్వామి ఆలయ అర్చకులు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి అన్నారు. శనివారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో శనేశ్వరుడి ఆలయానికి చేరుకొని తిలతైలాభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం బ్రహ్మసూత్ర శివుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో అర్చకులు శాంతికుమార్, ఉమ్మయ్య, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
‘నిర్వాసితులను విస్మరించడం తగదు’
చారకొండ: గోకారం జలాశయం ముంపు నుంచి తమ గ్రామాలను మినహాయించాలని 40 రోజులుగా నిర్వాసితులు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా విస్మరించడం తగదని ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా నిర్వాసితులు అన్నారు. డిండి– నార్లాపూర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపడుతున్న మండలంలోని గోకారం రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే లగచర్ల లడాయి వంటిది తప్పదని హెచ్చరించారు.
వివరాలు –IIలో u
– కల్వకుర్తి టౌన్
ప్రాణం తీసిన.. బైక్ సరదా
ప్రాణం తీసిన.. బైక్ సరదా


