వలంటీర్లను తీసుకుంటాం..
ఈసారి పులులు, ఇతర జంతువుల గణన పకడ్బందీగా కొనసాగుతుంది. గతంలో అరకొర సిబ్బందితో చేపట్టగా.. ఇప్పుడు పూర్తిస్థాయిలో చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు అటవీ సిబ్బంది 150 మందితోపాటు సమర్థవంతంగా పనిచేసే 50 మంది వాచర్లు ఉన్నారు. అలాగే వలంటీర్ల కోసం ఆన్‌లైన్‌లో 700 వరకు దరఖాస్తులు వచ్చాయి. అటవీ, పులులపై అవగాహన కలిగిన అర్హులు, పనితీరు మెరుగ్గా ఉన్న యువతను వలంటీర్లుగా తీసుకుంటాం.
– రోహిత్ గోపిడి, డీఎఫ్‌ఓ, నాగర్‌కర్నూల్
●


