
ఉల్లాస్‌తో ఉజ్వల భవిష్యత్
అచ్చంపేట రూరల్: జిల్లాలో గ్రామీణ జనాభే అధికం. అయితే వీరందరిని అక్షరాస్యులుగా మార్చేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో కార్యాచరణ అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా నిరక్షరాస్యులను గుర్తించే పనిలో గ్రామీణాభివృద్ధి, విద్య, వయోజన విద్య శాఖలు నిమగ్నమయ్యాయి. మొదట పల్లెలు, పట్టణాల్లో వివరాలను వీఓఏలు, ఆర్పీల ద్వారా సేకరించి.. సమాచారాన్ని ఉల్లాస్ యాప్‌లో పొందుపరుస్తారు. 14 ఏళ్లు పైబడిన నిరక్షరాస్యుల వయస్సు, చిరునామా, బ్యాంకు అకౌంట్, సెల్ నంబర్లు, సమీపంలోని ప్రభుత్వ పాఠశాల వివరాలను సేకరించి యాప్‌లో పొందుపరిచేందుకు మండలాల వారీగా విద్యాశాఖ అధికారులు శిక్షణ ఇస్తున్నారు. అనంతరం వలంటీర్లతో వారందరికీ చదువు నేర్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అక్షరాస్యులుగా మార్చడమే లక్ష్యంగా చర్యలు
మహిళా సంఘాల్లోని నిరక్షరాస్యులను గుర్తిస్తున్న అధికారులు
ప్రత్యేకంగా యాప్
రూపొందించిన ప్రభుత్వం
వివరాలు సేకరిస్తున్న గ్రామీణ
అభివృద్ధి, విద్య, వయోజన విద్య శాఖలు
జిల్లాలో ఇప్పటికే ప్రారంభమైన
శిక్షణ తరగతులు
చెంచుపెంటలు, తండాలపై దృష్టి..
గ్రామాలు, పట్టణాల్లో 14 ఏళ్లు పైబడిన నిరక్షరాస్యుల వివరాలు సేకరిస్తున్నాం. వారి సమాచారాన్ని ఉల్లాస్ యాప్‌లో పొందుపరిచేందుకు, విద్య నేర్పించేందుకు వలంటీర్లను నియమించాం. కార్యాచరణ మొదలు పెట్టి అందరిని అక్షరాస్యులుగా చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. ప్రత్యేకంగా జిల్లాలోని మారుమూల ప్రాంతాలైన చెంచుపెంటలు, గిరిజన తండాల్లో ఐటీడీఏ సహకారంతో ప్రత్యేక దృష్టిసారించి.. వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతాం. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలతో పకడ్బందీగా అమలు చేస్తాం.
– శ్రీనివాస్‌రెడ్డి,
వయోజన విద్య శాఖ ఉపసంచాలకులు, ఉమ్మడి మహబూబ్‌నగర్

ఉల్లాస్‌తో ఉజ్వల భవిష్యత్