
పాత పెన్షన్ విధానం అమలు చేయాలి
కిరాయిదారుల్లో అసంతృప్తి..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఆ తర్వాత అర్హుల లెక్క తేల్చేందుకు వచ్చిన దరఖాస్తులకు సంబంధించి పూర్తిస్థాయిలో వడపోసింది. విచారణ అనంతరం ఎల్–1, ఎల్–2, ఎల్–3 జాబితాను రూపొందించింది. మొదటి దశలో సొంతస్థలాలు ఉన్న దరఖాస్తుదారుల్లో అర్హులను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది. అయితే పక్కా భవనంలో అద్దెకుంటున్న వారిని లబ్ధిదారులుగా గుర్తించకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇల్లు లేకనే అద్దెకు ఉంటున్నామని.. మేం ఎలా అర్హులం కాదో చెప్పాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అర్హుల జాబితాలో చేర్చి.. చివరలో మొండిచేయి చూపడంతో పలువురు నానాతంటాలు పడుతున్నారు. ఎలాగూ వస్తుందని భావించి ఇళ్లు కూల్చుకున్న వారు నరకయాతన అనుభవిస్తున్నారు.
అటు రద్దు.. ఇటు లేఖలు..
ఉమ్మడి జిల్లాలో పలు ప్రాంతాల్లో 600కు మించి ఎక్కువ ఎస్‌ఎఫ్‌టీల విస్తీర్ణంలో ఇల్లు కట్టుకున్న పలువురి ప్రొసీడింగ్‌లను అధికారులు రద్దు చేశారు. మరికొన్ని చోట్ల పునాది వరకు 600 ఎస్‌ఎఫ్‌టీలకు మించి ఎక్కువ విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టినా.. స్లాబ్‌లెవల్ 600కు మించకుండా చూస్తామని లబ్ధిదారుల నుంచి రాత పూర్వక లేఖలు తీసుకున్నారు. ఇందులో కొందరికి మొదటి విడత బిల్లులు చెల్లించగా.. మరికొందరికి రాలేదు. ఉమ్మడి పాలమూరులో ఒక్కో జిల్లాకు ఒక్కో రీతిలో అధికారులు వ్యవహరిసుండడంతో లబ్ధిదారుల్లో అయోమయం నెలకొంది. ఈ క్రమంలో ప్రభుత్వ నిర్ణయంలో ఏమైనా మార్పు ఉంటుందనే ఆలోచనతో చాలా మంది నిర్మాణాలు చేపట్టకుండా వేచిచూస్తున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది.