
పునాది కూల్చేస్తేనే బిల్లు ఇస్తామన్నారు..
మొదటి విడతలో నా పేరు మీద ఇందిరమ్మ ఇలు్‌ల్ మంజూరైంది. నాకున్న ఖాళీ స్థలంలో నింబంధనల ప్రకారం రెండు వరుసల పునాది వేశాం. అధికారులు పరిశీలనకు రాగా.. మేం ముగ్గు వేసిన తర్వాతనే పనులు ప్రారంభించాలని.. పునాది కూల్చివేయాలని చెప్పారు. ఆ తర్వాతే ముగ్గు పోస్తామని.. మళ్లీ పునాది నిర్మించిన తర్వాత బిల్లు మంజూరవుతుందన్నారు. లేదంటే ఇల్లు రద్దు చేస్తామని చెప్పారు. చేసేదేమీ లేక పక్కనే చిన్న పూరి గుడిసె వేసుకుని అప్పులు చేసి ఇంటి నిర్మాణ పనులు చేపట్టాం. – లక్ష్మమ్మ,
పల్లెగడ్డ, మరికల్, నారాయణపేట
బిల్లు అడిగితే
స్పందించడం లేదు..
నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. నాకున్న ఖాళీ స్థలంలో అధికారులు 60 గజాలు కొలిచి ఇంటి నిర్మాణానికి ముగ్గు వేశారు. నాకు ఇద్దరు కుమారులు. దీంతో పక్కన మరింత ఖాళీ స్థలం ఉంటే ఇంటి నిర్మాణ పునాదిని విస్తరించాను. అధికారులు పరిశీలించి నిబంధనలు ఒప్పుకోవన్నారు. మేం ముగ్గు వేసిన వరకు నిర్మిస్తేనే బిల్లు మంజూరవుతుందని చెప్పారు. దీంతో వారు వేసిన ముగ్గు వరకే ఇల్లు నిర్మిస్తున్నా. గోడల పని పూర్తయింది. మొదటి బిల్లు ఇవ్వాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. స్పందించడం లేదు.
– గోపాల్, పల్లెగడ్డ, మరికల్, నారాయణపేట
●

పునాది కూల్చేస్తేనే బిల్లు ఇస్తామన్నారు..