
గూడు.. తీరొక్క గోడు!
‘ఇందిరమ్మ ఇళ్ల’లో కొర్రీలు
కల్వకుర్తి మండలం రఘుపతిపేటకు
చెందిన వడ్డేమాన్ రామకృష్ణకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసే సమయంలో అధికారులు వచ్చి ఫొటోలు తీసుకొని వెళ్లారు.
తీరా బేస్‌మెంట్ వరకు నిర్మాణం పూర్తిచేసి స్లాబ్ వేయగా.. బిల్లు మాత్రం రాలేదు. అధికారులను సంప్రదిస్తే 600 చదరపు అడుగుల కంటే ఎక్కువగా ఇంటి నిర్మాణం ఉండటంతో బిల్లు రావడం లేదని చెప్పారు. దీంతో చేసేది లేక ఇంటి నిర్మాణాన్ని ఆపేశారు. ప్రభుత్వం తనకు బిల్లు మంజూరు చేయాలని రామకృష్ణ వేడుకుంటున్నారు.
● అర్హుల జాబితాలో చేర్చి.. ఆపై తీసేయడంతో
ఆందోళన
● 600 ఎస్‌ఎఫ్‌టీలలోపే అనుమతితో
పలువురు దూరం
● అడ్డంకిగా మారిన పలు నిబంధనలు
● పక్కా ఇళ్లలో
అద్దెకున్న వారికి
వర్తించని పథకం

గూడు.. తీరొక్క గోడు!

గూడు.. తీరొక్క గోడు!