
ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్దాం
నాగర్‌కర్నూల్ రూరల్: సీపీఎం సీనియర్ నాయకుడు రణదివే ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్దామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో సీఐటీయూ ఆధ్యర్యంలో రణదివే వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాసులు మాట్లాడుతూ.. టెక్స్‌టైల్స్, రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రణదివే చేసిన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన 1969 వరకు ఏఐటీయూసీలో క్రియాశీలక పాత్ర పోషించారని తెలిపారు. పాలకవర్గాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు ఉద్యమాలు చేపట్టడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకటయ్య, రాధాకృష్ణ, రాజు, నరేష్, రామస్వామి పాల్గొన్నారు.