కొల్లాపూర్: పట్టణంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు స్కిల్ డెవలప్‌మెంట్ టాస్క్ రీజినల్ సెంటర్ హెడ్ నవీన్‌రెడ్డి, రిలేషన్‌షిప్ మేనేజర్ ఎండీ సిరాజ్, టాస్క్ ప్రతినిధి భాస్కర్‌లు మంగళవారం కొల్లాపూర్ వచ్చి.. పట్టణంలోని ప్రభుత్వ పీజీ కళాశాల పైఅంతస్తులు, మినీ స్టేడియంలోని ఆడిటోరియంను పరిశీలించారు. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు కావాల్సిన వసతి, సౌకర్యాల గురించి మంత్రి కార్యాలయ అధికారులు కృష్ణయ్య, నాగరాజు, ప్రభుత్వ పీజీ కళాశాల ప్రిన్సిపల్ మార్క్‌పోలోనియస్‌తో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే అన్ని పోటీ పరీక్షలకు, స్కిల్స్ పెంచే కోర్సులపై శిక్షణ ఇచ్చే సెంటర్ ఏర్పాటు చేసేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు సూచన మేరకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వివరించారు. సెంటర్ ఏర్పాటు అయితే స్థానిక యువతకు అన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు.


