బీసీలే ఎక్కువ | - | Sakshi
Sakshi News home page

బీసీలే ఎక్కువ

Apr 17 2026 10:26 AM | Updated on Apr 17 2026 10:26 AM

ఉమ్మడి వరంగల్‌లోని మొత్తం జనాభా 36,88,217లో 18,37,374 మంది వారే..

ఆ తర్వాతి వరుసలో

ఎస్సీలు, ఎస్టీలు, ఓసీలు

చివరి స్థానంలో బీసీ ముస్లిం, మైనారిటీలు

మొత్తం 12,32,892

ఇళ్లు ఉన్నట్టు నిర్ధారణ

తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య,

కులగణన సర్వేలో వెల్లడి

సాక్షి, వరంగల్‌: ఉమ్మడి వరంగల్‌ జనాభా 36,88,217 మంది అని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, కులగణన సర్వే నివేదిక తేల్చి చెప్పింది. అదే సమయంలో 12,32,892 ఇళ్లు ఉన్నట్లు ఉన్నాయని వెల్లడించింది. జనాభా పరంగా చూసుకుంటే 18,37,374 మంది బీసీలు తొలిస్థానంలో ఉంటే, 1,74,440 మందితో బీసీ ముస్లిం మైనారిటీలు చివరి స్థానంలో ఉన్నారు. ఇల్లు ఉన్నవారి విషయానికొస్తే ఓసీలు 35.35 శాతంతో తొలిస్థానంలో ఉండగా, 30.60% బీసీ ముస్లిం మైనారిటీలు చివరి స్థానంలో ఉన్నారు. అదేవిధంగా ఎస్టీలు అత్యధికంగా మహబూబాబాద్‌ జిల్లాలో 3,22,361 మంది ఉంటే...అత్యల్పంగా హనుమకొండలో 29,139 మంది ఉన్నారు. ఓసీలు అత్యధికంగా హనుమకొండ జిల్లాలో 89,410 మంది ఉంటే అత్యల్పంగా ములుగులో 20,684 మంది ఉన్నారని వెల్లడించింది. ఇక ఎస్సీలు అత్యధికంగా హనుమకొండ జిల్లాలో 1,83,984 మంది ఉంటే ములుగు జిల్లాలో అతి తక్కువగా 49,746 మంది ఉన్నారని తెలిపింది. బీసీలు అత్యధికంగా హనుమకొండ జిల్లాలో 4,50,150 మంది ఉంటే అతి తక్కువగా ములుగు జిల్లాలో 1,18,254 మంది ఉన్నారని పేర్కొంది.

జనాభాలో వరంగల్‌ జిల్లా ముందు...

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఆరు జిల్లాల మొత్తం జనాభా 36,88,217 ఉంటే వరంగల్‌ జిల్లాలోనే అత్యధికంగా 8,36,811 మంది ఉన్నట్టు సర్వే తేల్చింది. ఆ తర్వాత 8,04,515మందితో మహబూబాబాద్‌, 7,99,448మందితో హనుమకొండ, 5,45,449మందితో జనగామ, 4,07,896మందితో జయశంకర్‌ భూపాలపల్లిలు ఉండగా, చిట్టచివరగా 2,94,098 జనాభాతో ములుగు జిల్లా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement