
స్వచ్ఛతపై కేంద్ర బృందం సర్వే
ఏటూరునాగారం : మండలంలోని కోయగూడ ఎల్లాపురం గ్రామపంచాయతీలో గల ప్రభుత్వ కార్యాలయాలను స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ సెంట్రల్ టీం మంగళవారం తనిఖీ చేసింది. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ కార్యాలయం, ఆలయాలు, ఆస్పత్రులను బృందం సభ్యులు పరిశీలించారు. తడి,పొడి చెత్తసేకరణ, డంపింగ్ యార్డు, శ్మశాన వాటికలు, ఇంకుడు గుంతలను పరిశీలించి మండల పంచాయతీ అధికారి కుమార్‌ను వివరాలను అడిగి తెలుసుకున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం, గ్రామ పంచాయతీ సంయుక్తంగా పనులు చేసి స్వచ్ఛత ఉండే విధంగా చూడాలని సభ్యులు పేర్కొన్నారు. ఈ తనిఖీలో కేంద్ర బృందం ఆర్‌ఐలు రాజు, రేవంత్, ఎస్‌బీఎం జిల్లా అధికారి మైమునిషా, ఐఈసీ షర్పునిషా, ఏపీఓ చరణ్‌రాజు, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనారాయణ, ఎఫ్‌ఏ ముకుందరావు, కారోబార్ పాల్గొన్నారు.