బడి బస్‌.. ఫిట్‌లెస్‌! | - | Sakshi
Sakshi News home page

బడి బస్‌.. ఫిట్‌లెస్‌!

Jun 8 2025 1:53 AM | Updated on Jun 8 2025 1:53 AM

బడి బ

బడి బస్‌.. ఫిట్‌లెస్‌!

మొత్తం బస్సులు

ఫిట్‌నెస్‌ చేసుకున్నవి

చేయించుకోవాల్సినవి

జనగామ

భూపాలపల్లి

103 54 49

130 58 72

ఇవీ నిబంధనలు..

● 15 ఏళ్లు నిండిన వాహనాలను స్టూడెంట్స్‌ రవాణాకు ఉపయోగించకూడదు. స్కూల్‌ బస్సు పూర్తి కండిషన్‌లో ఉండాలి.

● విద్యా సంస్థ పేరు, సెల్‌ఫోన్‌ నంబరు, పూర్తి అడ్రస్‌ బస్సు ఎడమ వైపు, ముందు భాగంలో స్పష్టంగా కనిపించేలా రాయాలి.

● ప్రతీ విద్యాసంస్థ యాజమాన్యం డ్రైవర్‌ ఆరోగ్య పట్టిక నిర్వహించాలి.

● డ్రైవర్‌ షుగర్‌, బీపీ, కంటిచూపు వంటి ప్రాథమిక పరీక్షలను ప్రతి 3 నెలలకోసారి చేయించాలి. డ్రైవర్‌కు ఐదేళ్ల అనుభవం తప్పనిసరి.

● బస్సులో ప్రథమ చికిత్స పెట్టె అందుబాటులో ఉండాలి. అత్యవసర ద్వారం ఉండాలి. బస్సుకు సంబంధించి వైపర్స్‌, విండ్‌ స్క్రీన్‌, పార్కింగ్‌ లైట్స్‌, లైటింగ్‌ ఉండాలి.

● ప్రతి బస్సులో మంటలు ఆర్పే పరికరాలు ఉండాలి. డ్రైవర్‌కు విద్యార్థులు బస్సు ఎక్కడం, దిగడం స్పష్టంగా కన్పించేలా అద్దాలు అమర్చుకోవాలి.

● ప్రతి బస్సులో అటెండర్‌ ఉండాలి. బస్సులో ప్రయాణిస్తున్న స్టూడెంట్స్‌ పట్టిక కూడా ఉండాలి. బస్సులో స్టూడెంట్స్‌ బ్యాగులు పెట్టుకొనేలా అరలు ఏర్పాటు చేయాలి.

● కిటికీలకు మధ్యలో లోహపు కడ్డీలు కచ్చితంగా ఉండాలి.

● ఫుట్‌బోర్డ్‌పై మొదటి మెట్టు భూమికి 325 మిల్లీ మీటర్ల ఎత్తు మించకుండా చూడాలి. అన్ని మెట్లు జారకుండా లోహంతో నిర్మించాలి.

ములుగు

హనుమకొండ

95 46

49

920 485 435

(917 బస్సుల్లో 225 బస్సులను వివిధ కారణాలతో తిరస్కరించారు)

వరంగల్‌

మహబూబాబాద్‌

222 48

134

350 172 178

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పూర్తికాని బడి బస్సుల పరీక్షలు

‘పిల్లలున్నారు జాగ్రత్త’ అని బడి బస్సుల వెనకాల రాసి ఉంటుంది. కానీ.. చాలా బస్సుల నిర్వాహకులు మాత్రం.. ఆ విషయాన్నే మరిచిపోతున్నారు. నిబంధనల ప్రకారం.. ఏటా పాఠశాలల ప్రారంభానికి ముందే బడి బస్సులకు ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించుకోవాలి. కానీ క్షేత్రస్థాయిలో అవేమీ అమలు కావడం లేదనే విమర్శలున్నాయి.

– సాక్షి, వరంగల్‌/ఖిలా వరంగల్‌

డి గంట మోగే సమయం ఆసన్నమవుతోంది.. ఇప్పటికే అడ్మిషన్ల బిజీలో ఉన్న పాఠశాలలు బడి బస్సుల భద్రతపై దృష్టి సారించడం లేదు. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఫిట్‌నెస్‌ పరీక్షలకు వందలాది బస్సులు దూరంగా ఉండడం తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 1,820 పాఠశాలల, కాలేజీల బస్సులు ఉన్నా.. ఇప్పటివరకు 863 బస్సులు మాత్రమే ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించుకుని సర్టిఫికెట్లు పొందాయి. పదిహేనేళ్ల కాల పరిమితి పూర్తి చేసుకున్నా.. వివిధ కారణాల చేత 225 బస్సులను అధికారులు ఫిట్‌నెస్‌ చేయకుండా తిరస్కరించారు. ఇంకా మిగిలిన 692 బస్సులకు ఆన్‌లైన్‌ చేసి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్స్‌ తీసుకోవాలి. మరో ఐదు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఆయా బస్సులు వచ్చి సాధ్యమైనంత త్వరగా ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించుకోవాలని ఆర్టీఏ అధికారులు కోరుతున్నారు. ఫిట్‌నెస్‌ పరీక్షల్లో పాసైతే విద్యార్థుల భద్రతకు భరోసా ఉంటుందని చెబుతున్నారు. ‘యాబై రోజులకుపైగా మూసి ఉన్న విద్యా సంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఇన్నాళ్లూ విద్యార్థులను తరలించే బస్సులు షెడ్డుకే పరిమితమయ్యాయి. వాటి సామర్థ్య పరీక్షల గడువు కూడా మే 15కే ముగిసింది. ఇప్పటికీ ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించుకోని బడి బస్సులు వచ్చి త్వరగా చేసుకోవాలి’ అని వరంగల్‌ ఆర్టీఓ శోభన్‌బాబు కోరారు.

ఇలా చేస్తే మంచిది..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ప్రైవేట్‌ పాఠశాలల బస్సుల ఫిట్‌నెస్‌ పరీక్షలను సంబంధిత అధికారులు తూతూ మంత్రంగానే నిర్వహిస్తున్నారు. కనీసం పది నిమిషాలైనా చెక్‌ చేయకుండానే బస్సులను పంపించేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం అధికారులు అప్రమత్తమవుతున్నారని.. ప్రమాదాలు జరగకుండా ముందుగానే బస్సుల తనిఖీ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ‘పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి బస్సు ఫిట్‌నెస్‌ పకడ్బందీగా చూడాలి. చాలా పాఠశాలలకు ఎక్కువ సంఖ్యలో బస్సులుంటాయి. ఒకటి రెండు బస్సులను చూసే ఫిట్‌నెస్‌ అయ్యిందని మమ అనిపించకుండా ప్రతి బస్సును చెక్‌ చేయాలి. నెల, రెండు నెలలకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టి బస్సుల పరిస్థితి డ్రైవర్ల పరిస్థితి చెక్‌ చేస్తూ ఉండాలి. ఏవైనా లోపాలు ఉంటే ఒత్తిళ్లకు లొంగకుండా బస్సును సీజ్‌ చేయాలి’ అని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో ఇలా..

1,820కి ఇప్పటివరకు

పూర్తి చేసుకుంది 887

పరీక్షలు చేసుకోవాల్సింది 917..

ఫిట్‌నెస్‌ తనిఖీలకు రాని వందల బస్సులు

ఈనెల 12న పాఠశాల

పునఃప్రారంభంతో చర్చ

స్పెషల్‌ డ్రైవ్‌లకు సిద్ధమవుతున్న

ఆర్టీఏ అధికారులు

బడి బస్‌.. ఫిట్‌లెస్‌!1
1/1

బడి బస్‌.. ఫిట్‌లెస్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement