
ఘనంగా తిరంగా ర్యాలీ
ములుగు: ఆపరేషన్ సిందూర్‌లో భారత విజయానికి గుర్తుగా త్రివిధ దళాలకు మద్దతుగా వ్యాపారులు, ఆయా పార్టీల నాయకులు, వివిధ సంఘాల సభ్యులు ములుగులో మంగళవారం సాయంత్రం మూడు రంగుల జెండాలతో తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పహల్గం ఉగ్ర దాడిలో మృతి చెందిన పర్యాటకులకు నివాళులర్పిస్తూ జిల్లా కేంద్రంలోని తిరుమల థియేటర్ నుంచి డీఎల్‌ఆర్ పంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. భారత్ వైపు చూస్తే ఎదుర్కొనేందుకు ఆర్మీ, వైమానిక, నౌక దళాలతో పాటు సామాన్య ప్రజలు సైతం సిద్ధంగా ఉంటారనేది పాకిస్తాన్ గ్రహించాలని హెచ్చరించారు. భారత్ సైన్యం చూపెట్టిన పరాక్రమం, ధైర్య సాహసాలను కొనియాడారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన 28 మంది సామాన్య ప్రజలు, యుద్ధంలో వీరమరణం పొందిన మురళీనాయక్ ప్రాణత్యాగం మరిచిపోలేనిదని నినదించారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడిచేసి ధ్వంసం చేసిన ఘనత భారత బలగాలదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, మాజీ ఎంపీ సీతారాం నాయక్, విజయచందర్ రెడ్డి, గోవింద్ నాయక్, భాస్కర్ రెడ్డి, కుమార్, నాగరాజు, స్వరూప, సమ్మక్క, రమేష్ రెడ్డి, జర్నలిస్టులు పాల్గొన్నారు.