
హేమాచలుడి హుండీ ఆదాయం రూ.10.26 లక్షలు
మంగపేట: మండల పరిధిలోని హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ కార్యాలయ అధికారి శేఖర్, ఆలయ పరిశీలకుల పర్యవేక్షణలో మంగళవారం నిర్వహించిన హుండీల లెక్కింపు ద్వారా రూ.10,26,410 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రావణం సత్యనారాయణ తెలిపారు. ఈ ఏడాది మార్చి 27న ఏర్పాటు చేసిన 8 హుండీలతో పాటు ఈ నెల 8 నుంచి 17 వరకు జరిగిన స్వామివారి బ్రహ్మోత్సవాల(జాతర) సందర్భంగా ఆలయ పరిసరాల్లోని వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన 7హుండీలలో స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలను స్వామివారి కల్యాణ మండపంలో లెక్కింపు ప్రక్రియను నిర్వహించారు. భక్తులు సమర్పించిన కానుకలతో పాటు కొంత బంగారం, వెండి మిశ్రమ వస్తువులు రాగా వాటిని ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీలలో భద్రపరిచినట్లు ఈఓ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు శేఖర్‌శర్మ, పవన్‌కుమార్, రాజీవ్ నాగఫణిశర్మ, ఈశ్వర్‌చంద్, సిబ్బంది, ఆలయ సీనియర్ అసిస్టెంట్ సీతారామయ్య, సిబ్బంది శేషు, గోనె లక్ష్మినారాయణ, సిబ్బంది నూతుల కంటి అజయ్, నవీన్, గొర్లపెల్లి గణేశ్, పాల్వంచ, కొత్తగూడెం, మణుగూరుకు చెందిన శ్రీవారి సేవా బృందం భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

హేమాచలుడి హుండీ ఆదాయం రూ.10.26 లక్షలు