
విద్యార్థినులు క్రీడల్లోనూ రాణించాలి
వెంకటాపురం(ఎం): విద్యార్థినులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని డీఈఓ పాణిని సూచించారు. మండల పరిధిలోని జవహర్‌నగర్ కస్తూర్బా గాంధీ విద్యాలయంలో విద్యార్థినులకు నిర్వహించిన వేసవి శిక్షణ తరగతులు మంగళవారంతో ముగిశాయి. ఈ ముగింపు శిక్షణ కార్యక్రమానికి డీఈఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వేసవి శిక్షణ తరగతుల్లో చదువులో నేర్చుకున్న మెలకువలతో పాటు క్రీడల్లోనూ దృష్టి సారించి ప్రతిభ చూపాలన్నారు. అనంతరం సమ్మర్ క్యాంపులో నైపుణ్యం చూపిన బాలికలకు డీఈఓ బహుమతులు అందజేశారు. అదే విధంగా సమ్మర్ క్యాంపులో పాల్గొన్న విద్యార్థినులందరికీ సర్టిఫికెట్లను అందజేశారు.
సకాలంలో ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలి
వాజేడు: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను లబ్ధిదారులు సకాలంలో పూర్తి చేయాలని హౌజింగ్ ఏఈ ఎండీ.ఇషాక్ హుస్సేన్ కోరారు. మండల పరిధిలోని జంగాలపల్లిలో మంగళవారం బిల్లం సుధాకర్ ఇంటికి ఆయన ముగ్గు పోశారు. అనంతరం నాగారం గ్రామ పంచాయతీలో 64 ఇళ్లు మంజూరు ఓ ఇంటి నిర్మాణ పనులకు ముగ్గు పోశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరితగతిన ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేసే కొద్ది డబ్బులు లబ్ధిదారుల అకౌంట్లలో జమ అవుతాయని వివరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 22అడుగుల వెడల్పు, 18 అడుగుల అడ్డంతో ఇంటి నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీపీ కార్యదర్శి ప్రభాకర్, కాంగ్రెస్ నాయకుడు విక్రాంత్ తదితరులు పాల్గొన్నారు.
‘ఆపరేషన్ కగార్‌ను
నిలిపివేయాలి’
కన్నాయిగూడెం: కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై కర్రెగుట్టల్లో చేపట్టిన ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపి వేసి మావోస్టులతో చర్చలు జరపాలని అసైన్డ్ భూమి రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు, న్యాయవాది కలకోట మహేందర్ అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం వివిధ ప్రజా సంఘాల నాయకులతో కలిసి మండల పరిధిలోని ఏటూరు గ్రామానికి చెందిన మావోయిస్టు సాధనపల్లి చందు(అలియాస్ రవి) ఇటీవల కర్రెగుట్టల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందగా బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించి రూ.5వేల ఆర్థిక సాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌ను తక్షణమే నిలిపివేసి మావోయిస్టులను చర్చలకు పిలవాలన్నారు. యువత, మేధావులు, విద్యావంతులు మావోయిజం వైపు కాకుండా అంబేద్కరిజం వైపు పయనించాలని సూచించారు. కార్యక్రమంలో ములుగు జిల్లా సాధన సమితి అధ్యక్షుడు భిక్షపతిగౌడ్, జనార్ధన్, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు వెంకట్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సమ్మన్న పాల్గొన్నారు.

విద్యార్థినులు క్రీడల్లోనూ రాణించాలి

విద్యార్థినులు క్రీడల్లోనూ రాణించాలి