
గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి
● డీపీఓ దేవరాజ్
ములుగు: గ్రామాల అభివృద్ధికి పంచాయతీ కార్యదర్శులు పాటుపడాలని జిల్లా పంచాయతీ అధికారి ఒంటేరు దేవరాజ్ సూచించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో నిర్వహిస్తున్న భారత ప్రభుత్వ పరిపాలన సంస్కరణలు, ఫిర్యాదుల విభాగం, పంచాయతీ రాజ్ గ్రామీణ ఆభివృద్ధి శాఖ భాగస్వామ్యంతో మంగళవారం నిర్వహించిన శిక్షణ శిబిరానికి డీపీఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. అలాగే తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, గ్రామసభల పాత్ర, ప్రజల భాగస్వామ్యం, సమాచార హక్కు చట్టం, పారదర్శకత వివిధ శాఖల సమన్వయం, మహిళా సాధికారత, బాలల హక్కులు అంశాలపై కార్యదర్శులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎంపీడీఓ రామకృష్ణ, ఎంపీఓ ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు.