విక్రమ్‌లో సూర్య ‘రోలెక్స్‌ సర్‌’ అంత బాగా ఎలా పేలాడు?

Vikram Rolex Role: Suriya Reveals Reason Behind Terrific Look - Sakshi

తెరపై కనిపించింది జస్ట్‌ కొన్ని నిమిషాలు.. అయినా థియేటర్లు దద్దరిల్లిపోయేలా చేశాడు నటుడు సూర్య. కమల్‌ హాసన్‌ ‘విక్రమ్‌’ సినిమాలో క్లైమాక్స్‌లో వచ్చే రోలెక్స్‌ క్యారెక్టర్‌ ఎంత బ్రహ్మాండంగా పేలిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రెడిట్‌ లోకీ అలియాస్‌ దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌కే దక్కుతుంది.

కమల్‌ హాసన్‌ విక్రమ్‌ సినిమాలో సూర్య రోల్‌ ఎవరూ ఊహించనిది. చాలా స్పెషల్‌గా.. అంతే క్రూరంగా డిజైన్‌ చేశాడు ఆ క్యారెక్టర్‌ను. ముందస్తు ప్రకటన లేకుండా సైలెంట్‌గా షూటింగ్‌ పూర్తి చేశాడు డైరెక్టర్‌ లోకేశ్‌. ఫొటోలు లీక్‌ కాకుంటే.. ఆ విషయం కూడా బయటకు పొక్కేది కాదు. అయితేనేం సినిమా అంతా ఒక ఎత్తు అయితే.. క్లైమాక్స్‌లో వచ్చే సూర్య పోర్షన్‌ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. రగ్గ్‌డ్‌ లుక్‌, రక్తపాతంతో  టెర్రిఫిక్‌ విలనిజం పండించాడు సూర్య.

చేసింది కామియో అయినా మంచి ఇంపాక్ట్‌ చూపించింది ఆ క్యారెక్టర్‌. అంతేకాదు.. సినిమా రిలీజ్‌ అయినప్పటి నుంచి ప్రతీరోజూ ట్విటర్‌లో ‘రోలెక్స్‌’ ‘రోలెక్స్‌ సర్‌‌’ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతూనే ఉన్నాయి. అయితే ఆ లుక్‌ వెనుకాల ఉంది ఎవరో సోషల్‌ మీడియాలో రివీల్‌ చేశాడాయన. చెక్క చివంత వానం, కాట్రూ వెలియిదై, ఇరుది సూట్రూ చిత్రాలకు పని చేసిన మేకప్‌ ఆర్టిస్ట్‌ సెరినా టిక్సియెరా.. సూర్య మేకోవర్‌కు కారణం. అందుకే ఆమెతో ఉన్న ఫొటోను షేర్‌ చేసి కృతజ్ఞతలు తెలియజేశాడు.

సూర్య గతంలో 24 సినిమాలో నెగెటివ్‌ రోల్‌ చేసినా.. విక్రమ్‌ రోలెక్స్‌ మాత్రం టాప్‌ నాచ్‌ అనే చెప్పొచ్చు. అందుకే ఆయన అభిమానులు కూడా రోలెక్స్‌ను తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఖైదీ-2లో అన్నదమ్ములు కార్తీ-సూర్యల మధ్య పోరు కోసం ఎదురు చూస్తున్నారు.  

చదవండి: రోలెక్స్‌కు రోలెక్స్‌ తొడిగిన లోకనాయకుడు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top