Liger Moive: లైగర్ నుంచి ముచ్చటగా మూడో సాంగ్ కోకా 2.0 రిలీజ్

విజయ్ దేవరకొండ, అనన్యా పాండే జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లైగర్’. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మించారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ నెల 25న ఈ సినిమా విడుదల కానుంది.
కాగా ఈ చిత్రంలోని ‘కోకా 2.0..’ అనే పాటని శుక్రవారం విడుదల చేశారు. భాస్కరభట్ల సాహిత్యం అందించిన ఈ పాటను గీతా మాధురి, రామ్ మిరియాల పాడారు. ఈ పాటలో పూరి జగన్నాథ్ కూడా కనిపిస్తారు.