తల్లి కోసం గుడి కట్టించిన స్టార్‌ హీరో! | Vijay Built Sai Baba Temple For His Mother Shobha | Sakshi
Sakshi News home page

అమ్మ అంటే ఎంత ప్రేమో.. తనకోసం ఆలయాన్నే కట్టించిన హీరో

Apr 10 2024 8:26 AM | Updated on Apr 10 2024 9:36 AM

Vijay Built Sai Baba Temple For His Mother Shobha - Sakshi

ఈయన తన తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారనే వార్త చాలా కాలంగానే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. నిజానికి విజయ్‌కు తన తల్లి శోభ అంటే చాలా ఇష్టం. ఎం

స్టార్‌ హీరోగా రాణిస్తున్న విజయ్‌ రాజకీయ రంగప్రవేశాన్ని అందరూ ఊహించిందే! కానీ పాలిటిక్స్‌ కోసం నటనకు స్వస్తి చెబుతారని ఎవరూ ఊహించలేదు. ఈయన ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌. వెంకట్‌ప్రభు దర్శకత్వంలో ఏజీఎస్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. త్వరలో తాను నటించే 169వ చిత్రం ప్రారంభం కానుంది. ఈ చివరి చిత్రానికి ఆయన ఏకంగా రూ. 250 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

తల్లంటే ఎంతో ఇష్టం
ఈ విషయం అటుంచితే ఈయన తన తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారనే వార్త చాలా కాలంగానే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. నిజానికి విజయ్‌కు తన తల్లి శోభ అంటే చాలా ఇష్టం. ఎంతగా అంటే ఆమె కోసం ఆలయాన్ని కట్టించేంతగా! అవును విజయ్‌ తన తల్లి కోసం చెన్నైలోని స్థానిక కొరట్టూర్‌లో తన స్థలంలో సాయిబాబా గుడిని కట్టించారనే ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.

ఆలయంలో ప్రత్యేక పూజలు
ఈ ఆలయ కుంభాభిషేకం కూడా గత ఫిబ్రవరి నెలలో నిర్వహించారట. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌ చిత్రం షూటింగ్‌ గ్యాప్‌లోనూ విజయ్‌.. సాయిబాబా ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించాడని భోగట్టా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement