విజయ్ ఆంటోని మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌.. ఆసక్తిగా ట్రైలర్‌ | Vijay Antony Latest Movie Maargan Official Trailer out now | Sakshi
Sakshi News home page

Maargan Official Trailer: విజయ్ ఆంటోని మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌.. ఆసక్తిగా ట్రైలర్‌

May 27 2025 6:25 PM | Updated on May 27 2025 7:26 PM

Vijay Antony Latest Movie Maargan Official Trailer out now

బిచ్చగాడు ఫేమ్‌ విజయ్ ఆంటోనీ నటిస్తోన్న తాజా చిత్రం మార్గన్. కోలీవుడ్‌లో పలు చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసిన లియో జాన్‌ పాల్‌  ఈ మూవీ ద్వారా  దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాను మర్టర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలింస్ కార్పొరేషన్ బ్యానర్లో నిర్మించారు.

ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ ధీషన్‌ను విలన్‌గా కనిపించనున్నారు.  ఇప్పటికే రిలీజ్ చేసిన విజయ్ ఆంటోనీ ఫస్ట్‌ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ మర్డర్ మిస్టరీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఈ మూవీని జూన్‌ 27న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ట్రైలర్‌లోనే ప్రకటించారు. ఈ సినిమాలో సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖ, అర్చన, కనిమొళి, నటరాజన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement