దర్శకుల ప్రతిభను పెంచే నటుడు ధనుష్‌: వెంకీ అట్లూరి

Venkey Atluri Talk About Dhansuh SIR Movie - Sakshi

తమిళ సినిమా: ధనుష్‌ తొలిసారిగా తెలుగులో కథానాయకుడిగా నటించిన చిత్రం సార్‌. తమిళంలో పార్టీ పేరుతో రూపొందిన ఈ చిత్రాన్ని నాగ వంశీ, సాయి సౌమ్య నిర్మించారు. వెంకీ అట్లూరి కథ దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతాన్ని అందించారు. 1990 ప్రాంతంలో జరిగే కథా చిత్రంగా  తెరకెక్కించారు. విద్య కార్పొరేట్‌ సంస్థల చేతుల్లోకి వెళ్లిన పెద్ద వ్యాపారంగా మారి పేద విద్యార్థులకు ఎలా భారమవుతోంది, దాన్ని మార్చడానికి ఓ యువ ఉపాధ్యాయుడు  చేసే పోరాటమే ఈ చిత్రం. ఈనెల 17న తమిళం, తెలుగు భాషల్లో విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.

దీంతో చిత్రం శనివారం ఉదయం చెన్నైలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో సక్సెస్‌ మీట్‌ను నిర్వహించారు. ఇందులో పాల్గొన్న దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ ఇంత మంచి విజయాన్ని అందించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తనను నమ్మి ఈ అవకాశాన్ని కల్పించిన నిర్మాతలకు ధన్యవాదాలు చెప్పారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం పక్క బలంగా నిలిచిందన్నారు. ఇక నటుడు ధనుష్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదని, ఆయన దర్శకుల ప్రతిభను పెంచే నటుడని పేర్కొన్నారు. షూటింగ్‌లో ఏ విషయం గురించి అయినా వెంటనే ఓకే చెప్పే నటుడని కొనియాడారు. ఆయనతో పనిచేయటం మంచి అనుభవంగా పేర్కొన్నారు. వాతి  చిత్రం 8 రోజుల్లో రూ. 75 కోట్లు వసూలు చేసిందని దర్శకుడు తెలిపారు. ఇంకా భారీ మొత్తంలో వసూలు చేస్తుందని దర్శకుడు వెంకీ అట్లూరి ధీమా వ్యక్తం చేశారు.   

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top