Upasana Konidela Tweet on Lavanya Tripathi Welcomes To Mega Family - Sakshi
Sakshi News home page

Upasana: కాబోయే తోడి కోడలికి ఉపాసన గ్రాండ్ వెల్‌కమ్!

Jun 10 2023 4:46 PM | Updated on Jun 27 2023 11:19 AM

Upasana Konidela Welcomes Lavanya Tripathi Into Mega Family - Sakshi

నాగబాబు తనయుడు, మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల ఎంగేజ్‌మెంట్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగిన సంగతి తెలిసిందే. మణికొండలోని పామ్ బ్రీజ్ గేటేడ్ కమ్యూనిటీలోని నాగబాబు నివాసంలో జరిగిన ఈ వేడుకలో మెగాస్టార్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ నిశ్చితార్థానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సతీమణి ఉపాసన కూడా హాజరైంది. తాజాగా ఉపాసన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాబోయే మెగా కోడలు లావణ్య త్రిపాఠికి వెల్‌కమ్‌ చెబుతూ ఎంగేజ్‌మెంట్‌లో దిగిన ఫోటోను షేర్ చేసింది.  అంతేకాకుండా ఈ జంటకు రామ్‌ చరణ్ కూడా కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు. 

(ఇది చదవండి: వరుణ్‌తో నిశ్చితార్థం, లావణ్య త్రిపాఠి చీర ధరెంతో తెలుసా?)

ఉపాసన తన ట్వీట్‌లో రాస్తూ.. 'వెల్‌కమ్‌ టూ కొణిదెల ఫ్యామిలీ మై డియరెస్ట్ లావణ్య.. రాబోయే నా తోడి కోడలి వేడుక కోసం ఎదురు చూస్తున్నా. వరుణ్‌ నీతో చాలా సంతోషంగా ఉంటాడు.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ కూడా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొణిదెల లావణ్య అంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement