హీరోగా రవితేజ వారసుడు.. టీజర్‌ రిలీజ్‌ | Sakshi
Sakshi News home page

Mr Idiot Teaser: మాస్‌ మహారాజా టైటిల్‌తోనే వారసుడి ఎంట్రీ.. టీజర్‌ వచ్చేసింది!

Published Fri, May 10 2024 12:37 PM

Tollywood Movie Mr Idiot Teaser Released By Ravi Teja

మాస్ మహరాజ్ రవితేజ వారసుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. మాధవ్ హీరోగా న‌టిస్తోన్న‌ తాజా చిత్రం "మిస్టర్ ఇడియ‌ట్‌". పెళ్లి సందడి ఫేమ్‌ డైరెక్టర్‌ గౌరీ రోణంకి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సిమ్రాన్ శ‌ర్మ హీరోయిన్‌గా కనిపించనుంది.. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రవిచంద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజ‌ర్‌ను ర‌వితేజ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు అల్‌ ది బెస్ట్‌ చెప్పారు.

టీజర్‌ చూస్తే రొమాంటిక్‌ లవ్‌ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాలేజీ ప్రేమకథా చిత్రంగా ఈ సినిమాను రూపొందించినట్లు టీజర్‌లో కనిపిస్తోంది. టీజర్‌ కాలేజీ సీన్స్‌, కామెడీ చూస్తే ఫుల్‌ లవ్‌ అండ్‌ కామెడీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్‌ సంగీతమందిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement