
మరో డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు టాలీవుడ్ హీరో అశ్విన్ బాబు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం శివం భజే. ఈ మూవీని అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇందులో దిగాంగన సూర్యవన్షి హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా పాన్ ఇండియా సినిమాలపై అశ్విన్ బాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు.
అశ్విన్ బాబు మాట్లాడుతూ..'తెలుగులో చాలా పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి. చాలా వరకు హిట్ అయ్యాయి. నేను మాత్రం ఎక్కువగా స్క్రిప్ట్‌ను నమ్ముతాను. కంటెంట్ మాత్రమే పాన్ ఇండియా అనుకుంటా. ఎందుకంటే హిడింబ చిత్రాన్ని మనకంటే హిందీలో ఎక్కువగా చూశారు. ఇది నేను ఊహించలేదు. శివం భజే పాన్ ఇండియా రిలీజ్ కాకపోయినా సరే.. సినిమా రీచ్ అయితే చాలు' అని అన్నారు.
ట్రైలర్ చూస్తే ఎన్ఐఏ గూఢచారి సంస్థకి చెందిన ఏజెంట్‌గా అశ్విన్ బాబు కనిపించనున్నారు. ఆగస్టు 1న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో హైపరి ఆది, మురళి శర్మ, సాయిధీనా, బ్రహ్మజీ, తులసి, దేవి ప్రసాద్, షకలక శంకర్, ఇనయా సుల్తానా కీలక పాత్రలు పోషించారు.
నాకు ప్యాన్ ఇండియా వద్దు.. సినిమా రీచ్ అయితే చాలు!
Hero @imashwinbabu says, "I believe in only content!"💥💥#AshwinBabu #ShivamBhaje #TeluguFilmNagar pic.twitter.com/mFdt7s8Mfs— Telugu FilmNagar (@telugufilmnagar) July 23, 2024