
ఒకప్పుడు రీమేక్ అంటే బాక్సాఫీస్ దగ్గర బాగానే వర్కౌట్ అయ్యేది. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. ఎంత బాగా తీసినా సరే జనాలు.. ఒరిజినల్‍తో పోల్చి చూస్తున్నారు. దీంతో గత కొన్నేళ్లలో పలు భాషల్లో వచ్చిన, వస్తున్న రీమేక్స్ అన్నీ ఫ్లాప్స్ అవుతున్నాయి. రెండు రోజుల క్రితం హిందీలోనూ 'బాఘీ 4' పేరుతో ఓ మూవీ రిలీజైంది. టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన ఈ చిత్రం కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడీ చిత్రం కూడా రీమేక్ అనే సంగతి బయటపడింది.
(ఇదీ చదవండి: 'లిటిల్ హార్ట్స్'తో మరో హిట్.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా?)
ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ వారసుడిగా టైగర్ ష్రాప్.. ఇండస్ట్రీలోకి వచ్చాడు. 'హీరో పంతి' అనే సినిమాతో నటుడిగా పరిచయమయ్యాడు. ఇది యావరేజ్ అనిపించుకుంది. టైగర్ యాక్ట్ చేసిన తొలి మూవీ ఓ రీమేక్. అల్లు అర్జున్ 'పరుగు' చిత్రమే ఇది. అలానే టైగర్ ష్రాఫ్ పేరు చెప్పగానే గుర్తొచ్చేది 'బాఘీ' ఫ్రాంచైజీ. ఇప్పటివరకు ఇందులో నాలుగు మూవీస్ రిలీజ్ కాగా అవన్నీ దక్షిణాది చిత్రాల ఆధారంగా తీసిన రీమేక్స్. కాకపోతే ఎక్కడా అధికారికంగా ఇది దీని రీమేక్ అని టీమ్ చెప్పలేదు.
బాఘీ.. ప్రభాస్ 'వర్షం' రీమేక్, బాఘీ 2.. అడివి శేష్ 'క్షణం' రీమేక్, బాఘీ 3.. తమిళ చిత్రం 'వెట్టై' రీమేక్, తాజాగా రిలీజైన బాఘీ 4.. తమిళ మూవీ 'ఐతు ఐతు ఐతు'కి రీమేక్. ఇలా పేరుకే యాక్షన్ ఫ్రాంచైజీ అని పెట్టుకున్నారు కానీ నచ్చిన రీమేక్స్‌ని ఇష్టమొచ్చినట్లు మార్చేసి తీసిపడేస్తున్నారు. మొదటి భాగానికే ఫ్లాప్ టాక్ వచ్చింది. అయినా సరే వరసగా సీక్వెల్స్ తీస్తూనే ఉన్నారు. తాజాగా రిలీజైన నాలుగో భాగానికి కూడా ఏ మాత్రం పాజిటివ్ రివ్యూలు రాలేదు. టాప్ ఇంగ్లీష్ వెబ్ సైట్స్ అన్నీ 1 రేటింగ్ ఇచ్చాయి. మరి ఇప్పటికైనా టైగర్.. బాఘీ ఫ్రాంచైజీని ఆపుతాడా? లేదంటే త్వరలో ఐదో పార్ట్‌తో వస్తాడా? అనేది చూడాలి?
(ఇదీ చదవండి: మహేశ్, అల్లు అర్జున్ బాటలో రామ్ చరణ్?)