
సినీ నటి, దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘తలైవి’. ఈ మూవీలో కంగనా రనౌత్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఎంజీఆర్‌గా అరవిందస్వామి నటించారు. కథను బాహుబలి ఫేమ్ విజయేంద్ర ప్రసాద్ సమకూర్చారు. విజయ్ దర్శకత్వంలో లిబ్రి మోహన్ పిక్చర్స్ కర్మ మీడి యా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 23న విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడింది.
ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు సినిమా పైన అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ సినిమా నుంచి పలు స్టిల్స్ విడుదలయ్యాయి. ఇందులో కంగనా, అరవింద్ స్వామి కనిపిస్తున్నారు.
జయలలిత హీరోయిన్‌గా ఉన్ననప్పుడు ఎలా ఉన్నారు, రాజకీయాల్లోకి వచ్చాక ఎలా మారారో అచ్చం అలాగే తాజా స్టిల్స్ ఉన్నాయి. జయలలిత పదహారేళ్ల వయసు నుండి 60 ఏళ్ల వయసు వరకూ మొత్తం నాలుగు దశలను తలైవి బయోపిక్ లో చూపించనున్నారు. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.