చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకున్నా: తమన్నా | Tamanna Opens Up On Why Her Bollywood career did not click | Sakshi
Sakshi News home page

Tamannaah: చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకున్నా

May 20 2022 11:03 AM | Updated on May 20 2022 11:13 AM

Tamanna Opens Up On Why Her Bollywood career did not click - Sakshi

దక్షిణాదిలో స్టార్‌ హీరోయిన్లలో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు. ‘శ్రీ’ మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన తమన్నా స్టార్‌ హీరోలందరి సరసన నటించిన అగ్ర నటిగా పేరు తెచ్చుకుంది. దక్షిణాదిలో ఆమె నటించిన చిత్రాలు పెద్దగా విజయం సాధించకపోయిన తన నటనతో మెప్పిస్తూ వరుస ఆఫర్స్‌ అందిపుచ్చుకుంది. సౌత్‌లో హీరోయిన్‌గా బిజీ ఉన్న క్రమంలో తమన్నాకు బాలీవుడ్‌ నుంచి పిలుపు వచ్చింది. దీంతో అజయ్‌ దేవగన్‌ సరసన ‘హిమ్మత్‌ వాలా’ మూవీతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది ఈ మిల్కీ బ్యూటీ.

చదవండి: కాన్స్‌ చిత్రోత్సవాల్లో ఐశ్వర్యరాయ్‌.. బ్యూటిఫుల్‌, దేవత అంటూ ప్రశంసలు

అదే సమయంలో సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుండంతో ఈ మూవీతో బాలీవుడ్‌లో కూడా మంచి హిట్‌కొట్టాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది. విడుదలకు ముందు ఎంతో హైప్‌ క్రియేట్‌ చేసిన ఈ చిత్రం రిలీజ్‌ అనంతరం దారుణంగా పరాజయం పొందింది. దీంతో ఆ తర్వాత తమన్నాకు బాలీవుడ్‌లో పెద్దగా ఆఫర్స్‌ రావడం లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న తమన్నా హిందీ ఆఫర్స్‌పై స్పందించింది. తాను చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకుంటున్నానని, ప్రస్తుతం చాలా జాగ్రత్తగా సినిమాలు ఎంపిక చేసుకుంటున్నానని చెప్పింది. 

చదవండి: త్రివిక్రమ్‌, మహేశ్‌ సినిమాలో మరో స్టార్‌ హీరో!

సౌత్‌ సినిమాలు బాలీవుడ్‌లో బాగా ఆడుతున్నాయని పేర్కొన్నా తమన్నా దక్షిణాది సినిమాలపై ఎలాంటి కంప్లెయింట్స్‌ లేవని చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం తమన్నా తెలుగులో నటించిన ఎఫ్‌ 3 మూవీ మే 27న విడుదుల కాబోతోన్న సంగతి తెలిసిందే. వీటితో పాటు గుర్తుందా సీతాకాలం సినిమాలు చేస్తోంది. హిందీలో ‘బోలే చుడియాన్‌’, ‘బ‌బ్లీ బౌన్స‌ర్’, ‘ప్లాన్ ఏ ప్లాన్ బీ’ చిత్రాల్లో న‌టిస్తుండ‌గా..షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న భోళా శంక‌ర్‌లో కీ రోల్ పోషిస్తోంది. ఇటీవ‌లే వ‌రుణ్ తేజ్ న‌టించిన గ‌ని సినిమాలో స్పెష‌ల్ సాంగ్‌లో మెరిసింది మిల్కీ బ్యూటీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement