శరణ్‌ కుమార్‌ హీరో లుక్‌ పోస్టర్‌ విడుదల చేసిన సూపర్‌ స్టార్‌ | Superstar Krishna Released Hero Look Poster Of Sharan Kumar | Sakshi
Sakshi News home page

సూపర్‌ స్టార్‌ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల

Aug 9 2021 2:38 PM | Updated on Aug 9 2021 2:41 PM

Superstar Krishna Released Hero Look Poster Of Sharan Kumar - Sakshi

సూపర్‌స్టార్ కృష్ణ‌, విజ‌య‌నిర్మల ఫ్యామిలీ నుంచి శ‌రణ్ కుమార్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఓ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో శరణ్‌ హీరోగా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను సూప‌ర్‌స్టార్ కృష్ణ విడుద‌ల చేశారు. శివ కేశ‌న కుర్తి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ వెన్నెల క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.3గా ఎం.సుధాక‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌హేశ్ పుట్టిన‌రోజు(ఆగ‌స్ట్‌9) సంద‌ర్భంగా ఈ సినిమాలో హీరో లుక్‌ను సూప‌ర్‌స్టార్ కృష్ణ రిలీజ్‌ చేశారు. హీరో త‌ల‌కి చిన్న‌గాయ‌మైన‌ట్లు బ్యాండేజ్ వేసుకుని నిల‌డి ఉంటే పోస్ట‌ర్‌లో జ‌నాలు, రెండు వాహ‌నాలు వెళ్ల‌డం .. ఇవ‌న్నీ సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి.

ఈ సంద‌ర్భంగా సూప‌ర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ.. ‘శరణ్ హీరోగా చేస్తోన్న సినిమా హీరో లుక్ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇది త‌న‌కు హీరోగా ప‌ర్‌ఫెక్ట్ ల్యాండింగ్ అవుతుంది. శ‌రణ్ యాక్ట‌ర్‌గా చాలా మంచి పేరు తెచ్చుకోవాల‌ని కోరుకుంటున్నాను’ అన్నారు. నిర్మాత ఎం.సుధాక‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘శరణ్‌కుమార్ హీరోగా చేస్తున్న ఈ సినిమా హీరో లుక్ పోస్టర్‌ను మ‌హేశ్‌ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సూప‌ర్‌ స్టార్ కృష్ణ‌గారు విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంది. సూప‌ర్‌స్టార్ ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇస్తోన్న శ‌ర‌ణ్‌కు ఈ సినిమా క‌చ్చితంగా మంచి బ్రేక్ ఇస్తుంది. అలాగే న‌రేశ్‌, జ‌యసుధ‌గారు, సుధీర్‌బాబు మా టీంను ప్ర‌త్యేకంగా అభినందించ‌డం హ్య‌పీగా ఉంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించి మ‌రిన్ని విష‌యాల‌ను తెలియ‌జేస్తాం’ అని ఆయన అన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement