రోడ్డు పక్కన ఆంటీ ఫుడ్‌ స్టాల్‌.. భోజనం చేసిన హీరోహీరోయిన్లు | Sundeep Kishan, Varsha Bollamma Eats Food In Roadside Stall in Hyderabad | Sakshi
Sakshi News home page

Ooru Peru Bhairava Kona: భోజనం పెడుతూ లక్షలు సంపాదిస్తున్న ఆంటీ.. ప్రమోషన్‌కు వాడేశారుగా!

Published Sat, Jan 20 2024 7:25 PM | Last Updated on Sat, Jan 20 2024 7:56 PM

Sundeep Kishan, Varsha Bollamma Eats Food In Roadside Stall in Hyderabad - Sakshi

ఇంటి ఫుడ్‌ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. కమ్మని భోజనాన్ని అమ్మ ప్రేమగా వడ్డిస్తుంటే కడుపునిండా తినాలనిపిస్తుంది. బయట రెస్టారెంట్లలో, వీధి పక్కన ఫుడ్‌ స్టాల్స్‌లో భోజనం దొరుకుతుంది కానీ ఆ ప్రేమ దొరకదు. ఓసోస్‌.. అదంతా ఒకప్పుడు.. ఈ మహిళ రాకతో అంతా మారిపోయింది. సాయికుమారి అనే మహిళ హైదరాబాద్‌లో కొంతకాలం క్రితం ఓ ఫుడ్‌స్టాల్‌ తెరిచింది.

సంపాదన మామూలుగా లేదు
రుచికరమైన వెజ్‌, నాన్‌వెజ్‌ వంటల్ని జనాలకు అందిస్తోంది. అంతేనా, వాటికి తోడు కన్నా, నాన్నా, చిన్నా అంటూ ప్రేమగా భోజనం వడ్డిస్తుంది. అంత ఆప్యాయత కురిపిస్తూ భోజనం వడ్డించే ఈవిడ నెలకు రెండున్నర లక్షల పైనే సంపాదిస్తోందట. సోషల్‌ మీడియాలో తన రీల్స్‌ కూడా తెగ పాపులర్‌ అవుతుంటాయి. దీంతో ఊరు పేరు భైరవ కోన టీమ్‌ వెంటనే అక్కడికి వెళ్లిపోయి ఆమె చేతి వంట రుచిచూసింది. సందీప్‌ కిషన్‌, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్‌ అక్కడి భోజనాన్ని తిని ఆస్వాదించారు.

ఫేమస్‌ ఫుడ్‌ స్టాల్‌లో హీరోహీరోయిన్ల భోజనం
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇకపోతే సందీప్‌ కిషన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో వర్షా బొల్లమ్మ, కావ్యా థాపర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిల్‌ సుంకర సమర్పణలో ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌పై రాజేశ్‌ దండా నిర్మిస్తున్నారు. 

చదవండి: అమ్మ అప్పుడు ఏడ్చేసింది.. నేను నచ్చజెప్పినా..

whatsapp channel

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement