
‘టెన్త్ క్లాస్ డైరీస్’ సినిమాలో పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఈ మూవీ పెద్ద హిట్టవుతుందనే నమ్మకం ఉంది’’ అని హీరో నిఖిల్ పేర్కొన్నారు. శ్రీరామ్, అవికా గోర్ జంటగా ‘గరుడవేగ’ అంజి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’.
Sriram Speech About Tenth Class Diaries In Pre Release Event: ‘‘టెన్త్ క్లాస్ డైరీస్’ సినిమాలో పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఈ మూవీ పెద్ద హిట్టవుతుందనే నమ్మకం ఉంది’’ అని హీరో నిఖిల్ పేర్కొన్నారు. శ్రీరామ్, అవికా గోర్ జంటగా ‘గరుడవేగ’ అంజి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అజయ్ మైసూర్ సమర్పణలో అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం నిర్మించిన ఈ సినిమా జూలై 1న విడుదలవుతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.
ఈ వేడుకలో దర్శకుడు బి. గోపాల్ మాట్లాడుతూ– ‘‘సహాయ దర్శకుడు కావాలనుకున్న నేను ముందు కెమెరా విభాగంలో చేశాను. సినిమాటోగ్రాఫర్ అంజి ఈ సినిమాతో దర్శకుడు కావడం సంతోషంగా ఉంది’’ అని తెలిపారు. ‘‘టెన్త్ క్లాస్ డైరీస్’లో ఎమోషన్‌తో పాటు కామెడీ కూడా ఉంది’’ అన్నారు అచ్యుత రామారావు. ‘‘కథలో మార్పులు చేశాక బడ్జెట్ డబుల్ అయింది. అయినా నిర్మాతలు రాజీ పడలేదు’’ ‘గరుడవేగ’ అంజి పేర్కొన్నారు. ‘‘ఈ సినిమా చూశాక పదో తరగతి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు’’ అని రవితేజ మన్యం చెప్పుకొచ్చారు. ‘‘ఒకరికి ఒకరు’ తర్వాత నేను చేసిన మంచి చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. నటుడిగా ఇది నాకు పునర్జన్మ అనాలి’’ అని హీరో శ్రీరామ్ తెలిపారు.
చదవండి: బుల్లితెర నటి ఆత్మహత్య.. 'ఐ లవ్ యూ సాన్' అంటూ సూసైడ్ నోట్
స్టూడెంట్స్‌గా హీరోలు.. బాక్సాఫీస్ వద్ద పరీక్షలు
మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో నరేష్ !