రామ్‌కు నో చెప్పిన పుష్ప విలన్‌! | Is Srinidhi Shetty And Fahadh Faasil To Act In In Ram Pothineni Directorial Debut, Read Interesting Story Inside | Sakshi
Sakshi News home page

రామ్‌ సినిమాలో కేజీఎఫ్‌ బ్యూటీ?

May 20 2026 9:33 AM | Updated on May 20 2026 10:18 AM

Is Srinidhi Shetty, Fahadh Faasil to Act In In Ram Pothineni Directorial Debut

ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు తొలిసారి దర్శకత్వం వహిస్తున్న మూవీ వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాను ఆయన సోదరుడు కృష్ణ పోతినేని నిర్మించనున్నారు. సైకలాజికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో రిలీజ్‌ చేయనున్నట్లుగా ఆల్‌రెడీ ప్రకటించారు. ఈ మూవీలో రామ్‌ వీర పాత్రలో కనిపించనున్నాడు. ఇందుకోసం స్పెషల్‌గా మేకోవర్‌ కూడా అయ్యాడు. ప్రస్తుతం ఈ చిత్ర ప్రీప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

హీరోయిన్‌ సరే, విలన్‌ ఎవరు?
అలాగే నటీనటుల ఎంపికపైనా రామ్‌ దృష్టి సారించాడట! ఈ మూవీలోని హీరోయిన్‌ పాత్రకు కేజీఎఫ్‌ బ్యూటీ శ్రీనిధి శెట్టిని సంప్రదించినట్లు తెలుస్తోంది. విలన్‌ పాత్ర కోసం మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌, తమిళ నటుడు, దర్శకనిర్మాత ఎస్‌జే సూర్యలను అనుకుంటున్నారట. కాకపోతే పుష్ప తర్వాత ఫహద్‌ ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటున్నాడు. ప్రస్తుతం తెలుగులో రెండు స్ట్రయిట్‌ సినిమాలు చేస్తున్న అతడు రామ్‌ సినిమాను రిజెక్ట్‌ చేసినట్లు ఫిల్మీదునియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మరి రామ్‌కు జోడీగా శ్రీనిధి, విలన్‌గా ఎస్‌జే సూర్య నటిస్తారేమో చూడాలి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement