ఇంట్లోనే ఉన్న సింగ‌ర్‌కు క‌రోనా పాజిటివ్ | Singer Smita And Her Husband Tests Coronavirus Positive | Sakshi
Sakshi News home page

టాలీవుడ్‌ సింగ‌ర్‌కు క‌రోనా

Aug 4 2020 8:32 PM | Updated on Aug 4 2020 8:38 PM

Singer Smita And Her Husband Tests Coronavirus Positive - Sakshi

బుల్లితెర నుంచి వెండి తెర మీద‌కు పాకిన క‌రోనా వ‌ల్ల ఇప్ప‌టికే ఎంద‌రో ప్ర‌ముఖులు ఆస్ప‌త్రిపాల‌య్యారు. ఈ బాధితుల లిస్టులో ద‌ర్శ‌కులు రాజ‌మౌళి, తేజ కూడా ఉన్నారు. తాజాగా పాప్ సింగ‌ర్ స్మిత క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఆమే స్వ‌యంగా సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించారు. "నిన్నంతా పిచ్చిపిచ్చిగా అనిపించింది. ఒళ్లు నొప్పులు పెడుతుంటే వ‌ర్క‌వుట్ వ‌ల్లేమో అనుకున్నా. కానీ ఎందుకైనా మంచిద‌ని ప‌రీక్ష చేయించుకుంటే నా భ‌ర్త శ‌శాంక్‌కు, నాకు కోవిడ్ పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. (రాజమౌళి ఫ్యామిలీకి కరోనా)

కానీ కొంచెం కూడా ల‌క్ష‌ణాలు లేవు. ఈ వైర‌స్‌ను త‌న్ని అవ‌త‌ల పారేసి, ప్లాస్మా దానం చేయ‌డం కోసం ఎదురు చూస్తున్నా. ఇక్క‌డ ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే నేను ఇంట్లోనే ఉన్నాను. అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకున్నాను. అయినా ఆ మాయ‌దారి కోవిడ్ ఇంట్లోకి వ‌చ్చి చేరింది" అని రాసుకొచ్చారు. దీనిపై ఓ అభిమాని కంగారుప‌డుతూ.. "అదేంటీ! మీరు ఇంట్లోనే ఉన్నానంటున్నారు.. మ‌రి క‌రోనా ఎలా వ‌చ్చింది?" అని ప్ర‌శ్నించాడు. బ‌హుశా ఇంట్లో విద్యుద్దీపాలు అమ‌ర్చేందుకు వ‌చ్చిన వ్య‌క్తి వ‌ల్లే వ‌చ్చి ఉంటుంద‌నుకుంటున్నాన‌ని స్మిత స‌మాధాన‌మిచ్చారు. (డైరెక్టర్‌ తేజకు కరోనా పాజిటివ్‌)

Advertisement
 
Advertisement
Advertisement