అందుకే మెడలో తాళిబొట్టు ధరిస్తా: నటుడు | Singer Palash Sen Revealed Why He Started Wearing Mothers Mangalsutra After His Fathers Death | Sakshi
Sakshi News home page

Palash Sen: ఆమెకు గుర్తుగా మెడలో మంగళసూత్రం వేసుకుంటా..

Published Wed, Jan 25 2023 2:17 PM | Last Updated on Wed, Jan 25 2023 2:18 PM

Singer Palash Sen Revealed Why He Started Wearing Mothers Mangalsutra After His Fathers Death - Sakshi

సింగర్‌, నటుడు పాలశ్‌ సేన్‌ మెడలో మంగళసూత్రం ధరిస్తాడు. ఎప్పుడుచూసినా ఆ మంగళసూత్రంతోనే దర్శనమిస్తాడు. అలా మెడలో తాళి ధరించడానికి గల కారణాన్ని తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టాడు పాలశ్‌. 'అమ్మ చాలా ధైర్యవంతురాలు. జమ్మూకాశ్మీర్‌లో బాలికలకు ప్రత్యేకంగా పాఠశాలలు ఉండేవి కాదు. అయినా సరే అమ్మ అందరూ అబ్బాయిలే ఉన్న స్కూల్‌కు వెళ్లి మరీ చదువుకుంది. 17 ఏళ్ల వయసులోనే ఇంటి గడప దాటి లక్నోకు వెళ్లి ఎంబీబీఎస్‌ పూర్తి చేసింది. నేను స్ట్రాంగ్‌గా ఉన్నానంటే కారణం నాకు జన్మనిచ్చిన తల్లే! తను కూడా స్ట్రాంగ్‌ కాబట్టే మా ఇద్దరి మధ్య తరచూ విభేదాలు, గొడవలు జరుగుతుంటాయి. కానీ అవి నీటి బుడగల వంటివి. 

అమ్మ నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి. నాన్న చనిపోయాక తను మంగళసూత్రం ధరించడం మానేసింది. అప్పటినుంచి నేను దాన్ని మెడలో వేసుకుంటున్నాను. స్టేజీపైకి వెళ్లినా కూడా తాళితోనే వెళ్తున్నాను. అది ఉంటే తన ఆశీర్వాదాలు నా వెన్నంటే ఉన్న ఫీలింగ్‌ వస్తుంది' అని చెప్పుకొచ్చాడు పాలశ్‌. కాగా పాలశ్‌ 1998 ఢిల్లీలో యూఫోరియా అనే మ్యూజిక్‌ గ్రూప్‌ ఆరంభించాడు. 2001లో ఫిల్‌హాల్‌ సినిమాతో యాక్టింగ్‌ను మొదలుపెట్టాడు. ఈ సినిమాలో టబు, సుస్మితా సేన్‌ నటించారు.

చదవండి: తాగే బ్రాండు మార్చుకో లేదా తీరు మార్చుకో.. బాలయ్యకు వార్నింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement