Siddhanth Kapoor: డ్రగ్స్‌ కేసులో హీరోయిన్‌ సోదరుడు.. పార్టీ లోపలి వీడియో వైరల్‌..

Siddhanth Kapoor Inside Party Video Goes Viral After Consuming Drugs - Sakshi

Siddhanth Kapoor Inside Party Video Goes Viral After Consuming Drugs: మొన్నటి ఆర్యన్‌ ఖాన్‌ డ్రగ్స్‌ కేసు మరవకముందే బాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్‌ కేసు సంచలనం సృష్టిస్తోంది. స్టార్‌ హీరోయిన్‌ సోదరుడు, వెటరన్‌ యాక్టర్‌ శక్తి కపూర్ తనయుడు సిద్దాంత్‌ కపూర్‌ను పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఆదివారం (జూన్‌ 12) రాత్రి బెంగళూరులో పార్టీ జరుగుతున్న హోటల్‌పై పోలీసులు దాడి చేయగా పలువురు డ్రగ్స్‌ సేవించినట్లు నిర్ధారించారు. వారిలో సిద్ధాంత్‌ కపూర్‌ కూడా ఉన్నట్లు ధృవీకరించారు. సిద్ధాంత్‌తోపాటు మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆరుగురు డ్రగ్స్‌ తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరిని ఉల్సూరు పోలీస్‌ స్టేషన్‌కు తరిలించినట్లు వెల్లడించారు. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సిద్ధాంత్‌ అరెస్ట్‌ అయిన కొద్ది గంటల తర్వాత ఈ వీడియో హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియోలో సిద్ధాంత్‌ డీజే ప్లే చేస్తూ కనిపించాడు. అతను ప్లే చేస్తున్న సంగీతానికి పార్టీలోని వారంతా డ్యాన్స్‌ చేయడం మనం చూడొచ్చు.

చదవండి: ఇటలీలో ఫ్యామిలీతో మహేశ్‌ బాబు.. ఫొటో వైరల్‌..

కాగా సిద్ధాంత్‌.. సల్మాన్‌ ఖాన్‌ 'జుడ్వా' చిత్రంతో బాలనటుడిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో రంగీలా పాత్రలో కనిపించాడు. 'భాగమ్‌ భాగ్‌', 'చుప్‌ చుప్‌కే', 'భూల్‌ భులాయా' సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గానూ పని చేశాడు. 'అగ్లీ', 'జజ్బా', 'భూత్‌: పార్ట్‌ 1', 'చెహ్రే' వంటి పలు సినిమాల్లో నటించాడు. తన సోదరి శ్రద్ధా కపూర్‌తో కలిసి 'హసీనా పార్కర్‌' సినిమాలోనూ నటించాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top