breaking news
consuming drugs
-
డ్రగ్స్ కేసులో హీరోయిన్ సోదరుడు.. పార్టీ లోపలి వీడియో వైరల్..
Siddhanth Kapoor Inside Party Video Goes Viral After Consuming Drugs: మొన్నటి ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు మరవకముందే బాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తోంది. స్టార్ హీరోయిన్ సోదరుడు, వెటరన్ యాక్టర్ శక్తి కపూర్ తనయుడు సిద్దాంత్ కపూర్‌ను పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఆదివారం (జూన్ 12) రాత్రి బెంగళూరులో పార్టీ జరుగుతున్న హోటల్‌పై పోలీసులు దాడి చేయగా పలువురు డ్రగ్స్ సేవించినట్లు నిర్ధారించారు. వారిలో సిద్ధాంత్ కపూర్ కూడా ఉన్నట్లు ధృవీకరించారు. సిద్ధాంత్తోపాటు మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆరుగురు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరిని ఉల్సూరు పోలీస్ స్టేషన్‌కు తరిలించినట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సిద్ధాంత్ అరెస్ట్ అయిన కొద్ది గంటల తర్వాత ఈ వీడియో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో సిద్ధాంత్ డీజే ప్లే చేస్తూ కనిపించాడు. అతను ప్లే చేస్తున్న సంగీతానికి పార్టీలోని వారంతా డ్యాన్స్ చేయడం మనం చూడొచ్చు. చదవండి: ఇటలీలో ఫ్యామిలీతో మహేశ్ బాబు.. ఫొటో వైరల్.. View this post on Instagram A post shared by Whatsinthenews (@_whatsinthenews) కాగా సిద్ధాంత్.. సల్మాన్ ఖాన్ 'జుడ్వా' చిత్రంతో బాలనటుడిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో రంగీలా పాత్రలో కనిపించాడు. 'భాగమ్ భాగ్', 'చుప్ చుప్కే', 'భూల్ భులాయా' సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ పని చేశాడు. 'అగ్లీ', 'జజ్బా', 'భూత్: పార్ట్ 1', 'చెహ్రే' వంటి పలు సినిమాల్లో నటించాడు. తన సోదరి శ్రద్ధా కపూర్‌తో కలిసి 'హసీనా పార్కర్' సినిమాలోనూ నటించాడు. -
'రాహుల్ గాంధీ డ్రగ్స్ తీసుకుంటూ చాలా సార్లు దొరికారు'
ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీలపై భారతీయ జనతాపార్టీ నేత సుబ్రహ్మణ్యస్వామి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం హైదరాబాద్ వచ్చిన ఆయన మాట్లాడుతూ... ప్రస్తుత ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ సర్కస్ సింహంలా, సోనియా రింగ్ మాస్టార్‌గా వ్యహరిస్తున్నారని ఆయన అభివర్ణించారు. సోనియా గాంధీ ఆస్తులు స్విస్ బ్యాంకు ఖాతాలలో మూల్గుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గతంలో యూనివర్శిటీలో చదువుతున్నప్పుడు నాలుగు సార్లు డ్రగ్స్ తీసుకుంటు దొరికిపోయారని సుబ్రహ్మణ్యస్వామి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేజీ బేసిన్ వల్ల 24 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు.