Shyam Singha Roy OTT Release Date Confirmed, Check OTT Platform - Sakshi
Sakshi News home page

Shyam Singha Roy OTT: ఓటీటీలోకి 'శ్యామ్‌ సింగరాయ్‌'.. ఎప్పుడు ? ఎక్కడా ?

Jan 8 2022 9:24 PM | Updated on Jan 9 2022 9:31 AM

Shyam Singha Roy Movie OTT Release Date Out - Sakshi

Shyam Singha Roy Movie OTT Release Date Out: పక్కిం​‍​టి కుర్రాడి నుంచి నేచురల్‌ స్టార్‌గా ఎదిగిన నాని తాజా చిత్రం శ్యామ్‌ సింగరాయ్‌. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 24న విడుదలై మంచి విజయం అందుకుంది. ఇందులో వాసు, శ్యామ్ సింగరాయ్ అనే రెండు విభిన్న పాత్రలు పోషించిన నాని, సాయి పల్లవిల కెమిస్ట్రీ బాగుందనే టాక్‌ వచ్చింది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ప్రొడక్షన్‌ నెంబర్‌ వన్‌గా వెంకట్‌ బోయనపల్లి నిర్మించారు. మొదటి నాలుగు రోజులు మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమాకు తర్వాత కలెక్షన్లు కాస్త తగ్గాయి. తెలంగాణలో పర్వాలేదనిపించిన శ్యామ్ సింగరాయ్‌ ఏపీలో కొంత వెనుకపడ్డాడు. 

అయితే థియేటర్ల ద్వారా ఆశించిన ఫలితం రాని శ్యామ్ సింగరాయ్‌ తాజాగా ఓటీటీలోకి అడుగుపెడుతున్నాడు. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో జనవరి 21న రిలీజ్‌ కానుంది ఈ సినిమా. శ్యామ్‌ సింగరాయ్‌ని భారీ ధరకు కొనుగోలు చేశారని సమాచారం. థియేటర్ల ద్వారా ఇప్పటివరకు రూ. 24.80 కోట్లు షేర్‌ వసూలు చేయగా రూ. 22.50 కోట్ల బిజినెస్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో ఎలాంటి రికార్డులు క్రియేట్‌ చేస్తుందో చూడాలి. 



ఇదీ చదవండి: థియేటర్‌ ముందు నాని 63 అడుగుల భారీ కటౌట్‌.. ఫొటోలు వైరల్‌

Advertisement
 
Advertisement
Advertisement