షెర్లిన్ చోప్రాపై 50 కోట్ల పరువు నష్టం దావా వేసిన శిల్పా దంపతులు

Shilpa Shetty and Raj Kundra Slap 50 Crore Defamation on Sherlyn For Allegations - Sakshi

Shilpa Shetty & Raj Kundra Sent Defamation Notice to Sherlyn Chopra: అ‍శ్లీల చిత్రాల చిత్రీకరణ విషయంలో బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా అరెస్టు అయిన విషయం తెలిసిందే. అనంతరం అతను బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే ఈ కేసు ఆరోపణల విషయమై శిల్పా దంపతులు నటి షెర్లిన్‌ చోప్రాపై పరువు నష్టం దావా వేశారు.

తనని బెదిరించి తనపై అశ్లీల చిత్రాలను తెరకెక్కించినట్లు నటి షెర్లిన్‌ చోప్రా ఫోర్నోగ్రఫీకి కేసులో రాజ్‌కుంద్రా జైలులో ఉన్న సమయంలో ఆరోపించింది. ఇటీవల సైతం అతను లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపులు, మోసం చేశారంటూ అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయమని షెర్లిన్‌ పోలీసులను కోరింది. తాజాగా ఈ కేసు విషయమై షెర్లిన్‌ ఆరోపణలు నిరాధారమని, వట్టి కల్పితాలంటూ కొట్టిపారేసిన శిల్పా దంపతుల తరఫు న్యాయవాదులు రూ.50 కోట్ల పరువు నష్టం దావా వేశారు. అవాంఛిత వివాదాలను సృష్టించడానికి, మీడియా దృష్టిని ఆకర్షించడానికి ఆ నటి ప్రయత్నిస్తుంది తప్ప అందులో ఎటువంటి నిజం లేదని అందులో పేర్కొన్నారు.

చదవండి: కొత్త తప్పులు చేస్తానంటున్న శిల్పాశెట్టి!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top