Jayasudha: సహజ నటి జయసుధకు ఎన్టీఆర్ పురస్కారం

సహజ నటి జయసుధ ప్రేక్షకలు మదిలో చెరగని ముద్ర వేసుకున్నారని కేంద్ర మంత్రి టి సుబ్బారామిరెడ్డి అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో వంశీ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకుని సినీ నటి జయసుధకు ఎన్టీఆర్ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు.
అంతకుముందు ఆకునూరి శారద నిర్వహణలో సినీ సంగీత విభావరి ఆహుతులను ఆకట్టుకుంది. ఆ కార్యక్రమంలో ఏపీ మాజీ డిప్యూటీ స్పికర్ మండలి ఉద్ద ప్రసాద్, సినీ దర్శకుడు ఎ కొదండరామిరెడ్డి, బి గోపాల్, రేలంగి నర్సింహారావు, వైవీఎస్ చౌదరి, వంశఅఈ సంస్థల వ్యవస్థాపకులు వంశీరాజు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు :