శేఖర్‌ కమ్ములతో మూడో సినిమా ప్లాన్‌ చేస్తున్న ఆ మేకర్స్‌ | Sekhar Kammula Third Film With Sree Venkateswara Cinemas, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Sekhar Kammula Upcoming Movies: శేఖర్‌ కమ్ములతో మూడో సినిమా ప్లాన్‌ చేస్తున్న ఆ మేకర్స్‌

Published Thu, Feb 1 2024 6:13 AM

Sekhar Kammula Third Film With Sree Venkateswara Cinemas - Sakshi

డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల, శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ కలయికలో మూడో సినిమా ప్రకటన వచ్చింది. శ్రీ నారాయణ్‌ దాస్‌ కె. నారంగ్‌ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ (ఏషియన్‌ గ్రూప్‌ యూనిట్‌), అమిగోస్‌ క్రియేషన్స్‌పై సునీల్‌ నారంగ్, పుస్కుర్‌ రామ్మోహన్‌ రావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. గతంలో వీరి కలయికలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా వచ్చిన ‘లవ్‌ స్టోరీ’ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది.

రెండో సినిమాగా ధనుష్, నాగార్జునలతో ఓ మల్టీ స్టారర్‌ మూవీ తెరకెక్కిస్తున్నారు శేఖర్‌ కమ్ముల. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం తిరుపతిలో జరుగుతోంది. తాజాగా ఈ ప్రొడక్షన్‌ హౌస్‌ తమ కొత్త చిత్రాన్ని ప్రకటించింది. ‘‘శేఖర్‌ కమ్ములతో తీయబోయే మూడో చిత్రం లార్జర్‌ దెన్‌ లైఫ్‌గా ఉంటుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. హై బడ్జెట్, టాప్‌ క్లాస్‌ సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో ఈ మూవీ రూపొందనుంది. ధనుష్, నాగార్జునలతో శేఖర్‌ కమ్ముల తీస్తున్న మూవీ చిత్రీకరణ పూర్తయ్యాక ఈ మూవీ సెట్స్‌పైకి వెళుతుంది’’ అన్నారు మేకర్స్‌. ఈ చిత్రానికి సమర్పణ: సోనాలీ నారంగ్‌.

 
Advertisement
 
Advertisement