శేఖర్‌ కమ్ముల చేతుల మీదుగా ‘వస్తున్నా.. వచ్చేస్తున్నా’ ఫస్ట్‌లుక్‌

Sekhar Kammula Launched Vastunna Vachestunna First Look - Sakshi

‘కౌసల్య కృష్ణమూర్తి, పడేసావే, ఆపరేషన్‌గోల్డ్‌ ఫిష్‌’ చిత్రాలతో కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్‌రాజు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వస్తున్నా.. వచ్చేస్తున్నా’. మిస్తి చక్రవర్తి హీరోయిన్‌గా  సందడి చేయనుంది. తేజస్వీ క్రియేటివ్‌ వర్క్స్‌ పతాకంపై సందీప్‌ గోపిశెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ సెన్సిబుల్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల చేతుల మీదుగా విడుదలైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కార్తీక్‌రాజు నటించిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ ఇంప్రెసివ్‌గా ఉంది అన్నారు. చిత్రం కూడా ప్రేక్షకులు అలరించేలా ఉంటుందని అనుకుంటున్నా. ఈ మూవీ విజయం సాధించి అందరికి మంచిపేరును తీసుకురావాలని ఆశిస్తున్నా’ అన్నారు శేఖర్ కమ్ముల.

అలాగే దర్శక నిర్మాత సందీప్‌ గోపిశె ట్టి మాట్లాడుతూ ‘ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల గారితో మా చిత్రం ఫస్ట్‌లుక్‌ విడుదల కావడం ఆనందంగా ఉంది. ఇది మా విజయానికి శ్రీకారంలా భావిస్తున్నాం. పూర్తి కమర్షియల్‌ అంశాలతో రూపొందిన ఫ్యామిలీ ఎమోషనల్‌ థ్రిల్లర్‌ ఇది. ఆడియన్స్‌ సర్‌ఫ్రైజ్‌గా ఫీలయ్యే ఎన్నోఅంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. పూర్తి కొత్తదనంతో, నిజాయితీగా తెరకెక్కించిన ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్‌ను విడుదల చేస్తాం’ అన్నారు. ప్రశాంత్‌, భీమనేని శ్రీనివాస్‌, దేవి ప్రసాద్‌, పోసాని కృష్ణమురళి, ఆమని, గణపతి, అన్వి, డా. శేషసాయి తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top