Sai Pallavi Win Behindwoods Gold Medal for Shyam Singha Roy Movie - Sakshi
Sakshi News home page

Sai Pallavi: సాయి పల్లవి ఖాతాలో మరో అరుదైన ఘనత, మూడోసారి గోల్డ్‌ మెడల్‌

May 29 2022 1:04 PM | Updated on May 29 2022 3:27 PM

Sai Pallavi Won Behindwoods Gold Medal For Shyam Singha Roy Movie - Sakshi

Sai Pallavi Won Gold Medal For Shyam Singha Roy Movie: హీరోయిన్ సాయి పల్లవి క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీకి వచ్చిన ఆనతి కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. అందం, అభినయంతో విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. అంతేకాదు తన డ్యాన్స్‌తో ఎంతోమందిని మెస్మరైజ్‌ చేస్తోంది ఈ నాచులర్‌ బ్యూటీ. ఫిదా మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఆమె తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తరువాత తెలుగులో వరుస విజయాలు అందుకుంటూ మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా మారింది. చివరిగా శ్యామ్‌ సింగరాయ్‌ చిత్రంతో అలరించిన ఆమెకు తాజాగా అరుదైన అవార్డు దక్కింది.

చదవండి: ఓటీటీకి శివకార్తికేయన్‌ లేటెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ ‘డాన్‌’, ఆ తేదీ నుంచే స్ట్రీమింగ్‌

ఈ సినిమాలో ఆమె పోషించిన దేవదాసి పాత్రకు గానూ గోల్డ్‌ మెడల్‌ అందుకొనుంది. ఈ ఏడాది బిహైండ్‌ వుడ్స్‌ అవార్డ్స్‌ వేడుకలో సాయి పల్లవి బంగారు పతకం సొంతం చేసుకుంది. కాగా ఇప్పటికే సాయి పల్లవి రెండు గోల్డ్‌ మెడల్స్‌ అందుకుంది. 2017లో ఆమె నటించిన కాళి సినిమాకు గానూ తొలిసారి గోల్డ్‌ మెడల్‌ అందుకోగా 2019లో మలయాళంలో ఫహాద్‌ ఫాజిల్‌ చేసిన అథిరిన్‌ సినిమాకి గానూ రెండోసారి గోల్డ్‌ మెడల్‌ తీసుకుంది. ఇప్పుడు తాజాగా శ్యామ్‌ సింగరాయ్‌ మూవీకి మూడోసారి గోల్డ్‌ మెడల్‌ తీసుకొవడం విశేషం. కాగా సాయి పల్లవి ఇటీవల తెలుగులో రానా సరసన నటించిన విరాట పర్వం జూలై 1న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.

చదవండి: SSMB28: మహేశ్‌ సినిమాలో విలన్‌గా నందమూరి హీరో? ట్వీట్‌తో క్లారిటీ!

Advertisement
 
Advertisement
Advertisement