
పిల్లల్ని ప్రేమతో చూడాలి కానీ, ఒకరు నల్లగా ఉన్నారు, ఒకరు తెల్లగా ఉన్నారు అంటూ కలర్ గురించి మాట్లాడటమేంటి? అని అసహనానికి లోనైంది బుల్లితెర నటి రుబీనా దిలైక్ (Rubina Dilaik). తనకు ఏడాదిన్నర వయసున్న కవల పిల్లలున్నారు. తమ ఇంటికి వచ్చినవారు పిల్లల రంగు గురించి మాట్లాడటం నటికి ఏమాత్రం నచ్చలేదు.

నా కూతుర్లకేమైందని..
దీని గురించి రుబీనా మాట్లాడుతూ.. నాకు పుట్టిన అమ్మాయిల్లో ఒకరు ఫెయిర్‌గా ఉంటే మరొకరు కాస్త డస్కీగా ఉంటారు. మా ఇంటికి వచ్చినవాళ్లు అదే విషయం పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఒకరితో మరొకర్ని కంపేర్ చేస్తున్నారు. అది నాకస్సలు నచ్చలేదు. రంగు గురించి మాట్లాడొద్దు, నా కూతుర్లిద్దరూ అందంగా ఉన్నారని వాళ్లకు గట్టిగా ఆన్సరిచ్చేదాన్ని. ఇంకోసారి నా ఇంట్లో.. పిల్లల మధ్య పోలిక తేవొద్దని వార్నింగ్ ఇచ్చాను. మా బంధువులైతే.. పాపకు మంచి రంగు రావడం కోసం శనగపిండితో స్నానం చేయించమనేవారు. అసలు ఆ విషయం గురించి మీరు అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదని బదులిచ్చాను.

చిన్నప్పటినుంచే నేర్పిస్తున్నా..
నా పిల్లలకేమైందని.. వారెంతో అందంగా ఉన్నారు. అలాగే ఇద్దరికీ ఆత్మస్థైర్యంతో ఉండాలని చిన్నప్పటినుంచే నేర్పిస్తున్నాను. అర్థం చేసుకోవడానికి వారిది చాలా చిన్నవయసు కానీ, ఇప్పటినుంచి నేర్పిస్తేనే విశ్వాసంతో ముందుకు వెళ్తారు అని చెప్పుకొచ్చింది. రుబీనా- అభినవ్ 2018లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ హిందీ బిగ్‌బాస్ 14వ సీజన్‌లో పాల్గొన్నారు. రుబీనా ఈ సీజన్ ట్రోఫీ గెలిచింది. ఇకపోతే పెళ్లయిన ఐదేళ్లకు రుబీనా గర్భం దాల్చింది. 2023లో కవల కూతుర్లు ఏధ, జీవాకు జన్మనిచ్చింది.
చదవండి: గుండెలు పిండేసే చిత్రం.. హిట్టయితే బాగుండు: శృతి హాసన్