గుండెలు పిండేసే చిత్రం.. హిట్టయితే బాగుండు: శృతి హాసన్‌ | Shruti Haasan Wish This Movie Has been a Bigger Success | Sakshi
Sakshi News home page

Shruti Haasan: ఆ సినిమా పెద్ద హిట్టవుతుందనుకున్నా.. రివర్స్‌ అయ్యేసరికి మనసు ముక్కలైంది

Jul 25 2025 5:05 PM | Updated on Jul 25 2025 5:54 PM

Shruti Haasan Wish This Movie Has been a Bigger Success

కొండంత ఆశ పెట్టుకున్న సినిమా ఆడకపోతే ఎంతో బాధగా ఉంటుంది. ఓ సినిమా విషయంలో తనూ అలాగే బాధపడ్డానంటోంది శృతి హాసన్‌ (Shruti Haasan). తాజాగా ఓ ఇంటర్వ్యూలో శృతి హాసన్‌ మాట్లాడుతూ.. కొన్ని సినిమాలు నాకెంతో స్పెషల్‌. వాటికోసం చాలా కష్టపడ్డాను. అవి బాక్సాఫీస్‌ వద్ద సరిగా ఆడనప్పుడు గుండె ముక్కలైనట్లు అనిపిస్తుంది.

హృదయం ముక్కలైంది
చాలామంది ఆ సినిమాను నమ్మి పని చేస్తారు. తీరా అది విజయం సాధించకపోయేసరికి దాన్ని తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. 3 సినిమా కమర్షియల్‌గా విజయం సాధించుంటే బాగుండేదనిపిస్తుంది. ఇప్పుడంటే పాన్‌ ఇండియా ట్రెండ్‌ ఉంది. ఓటీటీలు అందుబాటులో ఉన్నాయి. అప్పుడవన్నీ లేవు. 3 సినిమా హిందీలోకి డబ్‌ చేశాం. కానీ, ఓటీటీలు లేవు. ఆ మూవీ ఇప్పుడు రిలీజయ్యుంటే కొలవెరి సాంగ్‌ కంటే కూడా 3 చిత్రమే పెద్ద హిట్టయ్యేది. అలా కొన్ని చిత్రాలు ఎంతో కష్టపడి చేస్తే బాక్సాఫీస్‌ వద్ద పరాజయం పొందేవి అని చెప్పుకొచ్చింది.

3 మూవీలో ధనుష్‌, శృతిహాసన్‌

సినిమా
కాగా శృతిహాసన్‌ ప్రస్తుతం కూలీ మూవీ చేస్తోంది. రజనీకాంత్‌ హీరోగా నటించిన ఈ చిత్రం ఆగస్ట్‌ 14న విడుదల కానుంది. ఇందులో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్‌, ఆమిర్‌ ఖాన్‌ తదితరులు నటించారు. లోకేశ్‌ కగనరాజ్‌ దర్శకత్వం వహించగా అనిరుధ్‌ సంగీతం అందించాడు. 3 సినిమా విషయానికి వస్తే.. ధనుష్‌, శృతి హాసన్‌ జంటగా నటించారు. రజనీకాంత్‌ కూతురు ఐశ్వర్య (ధనుష్‌ మాజీ భార్య) దర్శకత్వం వహించింది. ఈ సినిమా విషాదకరమైన క్లైమాక్స్‌తో ముగుస్తుంది. గుండెల్ని పిండేసే ఈ చిత్రం 2012లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పుడు బాక్సాఫీస్‌ మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకోగా రీరిలీజ్‌ అయినప్పుడు మాత్రం హిట్టుగా నిలవడం విశేషం. 

చదవండి: సినిమాలు మానేసి క్యాబ్‌ డ్రైవర్‌గా పని చేస్తా: పుష్ప విలన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement